Nagavamsi:తెలుగు ప్రముఖ నిర్మాత నాగవంశీపై బాలీవుడ్‌ దర్శకుల వ్యంగ్యాస్త్రాలు

Viswa
3 Min Read

Nagavamsi: తెలుగు నిర్మాత నాగవంశీకి (Nagavamsi) సోషల్‌మీడియాలో కొద్దిపాటి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. బాలీవుడ్‌ బడా నిర్మాత బోనీకపూర్‌ వంటి వారితో కలిసి నాగవంశీ ఇటీవల ఓ రౌండ్‌టేబుల్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇక్కడ నాగవంశీ చేసిన వ్యాఖ్యలు కొందరు బాలీవుడ్‌ జనాలకు రుచించడం లేదు. దీంతో నాగవంశీపై సెటైరికల్‌గా ‘ఎక్స్‌’లో పోస్ట్‌లు చేస్తున్నారు.

సౌత్‌ సినిమా, నార్త్‌ సినిమా అన్న డిబెట్‌లో భాగంగా…నాగవంశీ, బోనీకపూర్‌కు మధ్య మంచి డిస్కషన్‌ జరిగింది. ఈ సమయంలో ‘‘అల్లు అర్జున్‌ ‘పుష్పది రూల్‌’ సినిమా సండే రోజున కేవలం హిందీ బెల్ట్‌లోనే రూ. 86 కోట్ల రూపాయలను కలెక్ట్‌ చేసిందని, ఆ రోజున ముంబై వాళ్లు (ఫిల్మ్‌ ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ..) ఎవరూ నిద్రపోయి ఉండరని కామెంట్‌ చేశారు.

ఈ కామెంట్‌పైనే బాలీవుడ్‌ దర్శకులు సిద్దార్థ్‌ ఆనంద్‌ (హిందీలో పఠాన్, వార్‌ వంటి సినిమాలు తీశాడు), సీనియర్‌ దర్శకుడు హన్సల్‌మెహతా ‘ఎక్స్‌’లో పోస్టులు చేశారు. ‘‘నిజమే..ముంబై ఎప్పటికీ నిద్రపోని నగరమే.(ఎప్పుడు వర్క్‌ చేస్తుంటారని అర్థం కావొచ్చు). బహుషా…కొంతమందికి (నాగవంశీని ఉద్దేశిస్తూ కాబోలు..) నిజమైన ముంబై తెలిసి ఉండకపోవచ్చు…అన్నట్లు మరో మాట…నేను బంద్రా, జుహూ ప్రాంత్లోనే నివస్తుంటాను’’ అంటూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు సిద్దార్థ్‌ ఆనంద్‌.

 

 

‘‘సరే..డూడ్‌..నువ్వు ఎవరైనా కానీ..నేను ముంబైలోనే నివస్తుంటాను. నిజంగా హాయిగా నిద్రపోతున్నాను’’ అంటూ ‘ఎక్స్‌’లో పేర్కొన్నాడు దర్శకుడు హన్సల్‌మెహతా.

Ramcharan Peddhi: సైలెంట్‌గా కథను మార్చేశారా?

ఇది ఇంతటితో ఆగలేదు. ఈ డిస్కషన్‌లో భాగంగా బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ను (ప్రముఖ నటి శ్రీదేవి భర్త, హీరో యిన్‌ జాన్వీకపూర్‌ తండ్రి) అగౌరవ పరిచేలా నాగవంశీ మాట్లాడారని, కొందరు నెటిజన్లు ఫైర్‌ అయ్యారు. ఈ విషయంపై నాగవంశీ కూడా ‘ఎక్స్‌’లో రెస్పాండ్‌ అయ్యారు.

‘బోనీకపూర్‌ అంటే తనకు ఎంతో గౌరవమని, డిస్కషన్‌ పూర్తయిన తర్వాత బోనీకపూర్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నానని, అనవసరమైన మాటలు మాట్లాడవద్దని’’ నాగవంశీ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

PushpaTheRule 1000 cores Collection: వెయ్యికోట్ల క్లబ్‌లో అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’…ఆపరేషన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌!

ఇక ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘దేవర’ సినిమాతో బోనీకపూర్‌ కుమార్తె జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా తెలుగు చిత్రపరిశ్రకు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా నాగవంశీ డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ఈ చిత్రం ఓ హిట్‌గా నిలిచింది.

 

Share This Article
4 Comments