Chandoo Mondeti Karthikeya 3: హీరో నిఖిల్, దర్శకుడు చందూమొండేటి కాంబినేషన్‌తో 2014లో ఎలాంటి అంచనాలు లేకుండా విడు దలైన ‘కార్తీకేయ’ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లోనే 2022లోవచ్చిన ‘కార్తీకేయ 2’ ఇంకా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నిఖిల్ వంటి కుర్ర హీరోకి హిందీ మార్కెట్‌లో దాదాపు రూ. 50 కోట్ల రూపాయాల గ్రాస్‌ను ఈ మూవీ తెచ్చిపెట్టింది.
‘కార్తీకేయ 2’ తర్వాత ‘కార్తీకేయ 3’ (Karthikeya 3) చేయాలనుకున్నాడు చందు మొండేటి. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడు. కానీ గీతా ఆర్ట్స్‌లో సూర్యతో సినిమా చేసే చాన్స్ దక్కింది. సూర్యకు రెండు కథలు కూడా వినిపించాడు చందు. కానీ అప్పట్లో సూర్య ‘కంగువ’తో బిజీగా ఉన్నడంతో, నాగచైతన్యతో ‘తండేల్’ మూవీని స్టార్ట్ చేశాడు చందు. ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదలై, బ్లాక్‌బస్టర్ కొట్టింది.
దీంతో తన నెక్ట్స్ మూవీని సూర్యతో చేయాలనుకున్నాడు చందు. కానీ ‘లక్కీభాస్కర్’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన వెంకీ అట్లూరితో సూర్య మూవీ చేయాలనుకుంటున్నాడు. వెంకీ అట్లూరి కథను వినిపించడం, సూర్య ఒకే అనడం అంతా జరిగిపోయాయి. దీంతో చందు వెయిటింగ్ లిస్ట్‌లో పడ్డాడు.
అందుకే ఇప్పుడు తన ఫోకస్‌ను అంతా ‘కార్తీకేయ 3’కి మల్లించాడు. ఎలాగూ ‘స్వయంభూ’ సినిమా నుంచి నిఖిల్ కూడా త్వరలోనే ఫ్రీ కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ‘కార్తీకేయ 3’ స్టార్ట్ చేయడానికి ఇదే సరైన సమయం కూడా ఇదే. పైగా మైథలాజికల్ చిత్రాలకు బాలీవుడ్‌లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. టైమ్‌లో కనక ‘కార్తీకేయ 3’ దిగితే, థియేటర్స్‌లో బ్లాక్‌బస్టర్ అవుతుంది. మరి..చందు ఏం చేస్తాడో చూడాలి.