‘వాల్తేరు వీరయ్య’ సినిమా చిరంజీవి (Chiranjeevi)కెరీర్‌లో వన్నాఫ్ ది బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ (Chiranjeevi and KS Ravindra Combo). ఈ సినిమాకు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకుడు (KSRavindra). ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత బాలకృష్ణతో బాబీ తీసిన ‘డాకు మహారాజ్’ సినిమా ఓ మోస్తారు హిట్‌గా నిలిచింది. రెండు వరుస హిట్ మూవీస్ తర్వాత దర్శకుడు కేఎస్ రవీంద్ర నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుందనే చర్చ మొదలైంది. అయితే..బాబీ తన దగ్గర ఉన్న మరో డిఫరెంట్ మాస్ కథలో, చిరంజీవిని మెప్పించాడు. చిరంజీవి, కేఎస్ రవీంద్ర కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుంది. కోన వెంకట్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అంది స్తారు. బాబీ స్టైల్ ఆఫ్ మాస్ కమర్షియల్ ఫిల్మ్‌గానే ఉండబోతుందీ సినిమా.
మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి (Director AnilRavipudi)తో చిరంజీవి చేయనున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీ (ChiruAnil) ఈ నెల 23 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం అవుతోంది. నయనతార హీరోయిన్‌గా చేస్తారు. కేథరీన్ మరో లీడ్ రోల్ చేస్తారు. ఆ మూవీ తర్వాత బాబీ ప్రాజెక్ట్‌ను సెట్స్‌కు తీసుకెళ్తారు చిరం జీవి. ఆ నెక్ట్స్ శ్రీకాంత్ ఓదెలతో సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్తారు చిరంజీవి. శ్రీకాంత్ ఓదెల తర్వాత దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో చిరంజీవి వర్క్ చేస్తారనే ప్రచారం సాగుతోంది.