చిరంజీవి చిక్కుల్లో పడ్డారు (Chiranjeevi controversial Comments). అసలు…ఏం జరిగిదంటే….బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘బ్రహ్మా ఆనందం’ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజౖరైయ్యారు చిరంజీవి.
‘బ్రహ్మాఆనందం’ సినిమా తాత–మనవళ్ళకు చెందిన స్టోరీ. దీంతో..యాంకర్ సుమ…చిరంజీవి ఫోటోను వేదిక డిస్‌స్లేపై చూపించి, కొణిదెల క్లీంకార (చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ కుమార్తె) తాత అంటూ… మాట్లాడింది. ఈ వెంటనే చిరంజీవి మైక్ అందుకుని ఈ విషయంపై çసరదాగా మాట్లాడారు. కానీ ఆయన మాటలు వివాదం అయ్యాయి.
‘మా ఇంట్లో అందరూ ఆడవాళ్లే. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏదో లేడీస్‌హాస్టల్‌లో ఉన్నట్లుగా ఉంటంది. నాకు నేను ఓ లేడీస్‌హాస్టల్ వార్డెన్‌లా ఫీలవుతుంటాను. లవ్లీ గర్ల్స్. ఇక రామ్‌చరణ్ కు మళ్లీ ఆడబిడ్డ పుడుతుం దోమోనని భయం. రామ్‌చరణ్..ఈసారైనా..అబ్బాయిని..కనరా.. అంటే లెగసీ కంటిన్యూ అవ్వాలి కదా..’ అంటూ మాట్లాడాడు.
Chiranjeevi politics: ఇక ఈ జన్మలో రాజకీయాల్లోకి వెళ్లను
అలాగే తన తాత మంచి రసికుడని, ఆయనకు ఇద్దరుముగ్గురు భార్యలు ఉండేవారని, ఆయన అలవాట్లను మేం నేర్చుకోకూడదని, మా పెద్దవాళ్లు మాకు చెప్పారని మాట్లాడాడు.
అంతేకాదు…ఎర్రి…అనే అభ్యంతరకరమైన మాట మాట్లాడారు. దీంతో సోషల్‌మీడియాలో చిరంజీవిపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఆడపిల్లలంటే అంత చులకనా..అంటూ చిరంజీవిపై నెటిజన్లు దు మ్మెత్తిపోస్తున్నారు. మరి…ఈ వివాదం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.
ఇక చిరంజీవికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు (సుష్మితా కొణిదెల, శ్రీజ), ఒక అబ్బాయి (రామ్‌చరణ్). సుష్మితా కొణిదెలకు ఒక కుమార్తె, శ్రీజకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్‌కు కూడా ఒక కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే.