ఇకపై జన్మలో రాజకీయాల్లోకి వెళ్లనని తేల్చిపడేశారు చిరంజీవి (Chiranjeevi politics). ఈ నెల 11న విశ్వక్‌సేన్ ‘లైలా’ (Laila) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి తన స్పీచ్ చివర్లో ‘జై జనసేన’ అన్నారు. అంతేకాదు… ప్రజా రాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందిందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రజారాజ్యం రాజకీయపార్టీ వ్యవస్థాపుకుడైన చిరంజీవి మళ్లీ రాజకీయాల గురించి మాట్లాడటం ఇటు ఇండస్ట్రీ వర్గా ల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. çకూటమి ప్రభుత్వంలో పవన్‌కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ సక్సెస్ తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో భారత ప్రధానమంత్రి మోదీ సభల్లో పాల్గొన్నారు చిరంజీవి (Chiranjeevi politics).
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల చేపట్టిన సేవా కార్యక్రమాల్లోనూ చిరంజీవి ఉత్సా హంగా పాల్గొన్నారు. చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా రామ్‌చరణ్ ఏర్పాటు చేసిన పార్టీలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు కాబట్టి… కాం గ్రెస్ ప్రభుత్వానికి చిరంజీవి దగ్గరగా ఉంటున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇలా..ఇటు బీజేపీ, అటు.. కాంగ్రెస్‌లతో చిరంజీవి ఉండటంతో ఏదో ఒక రాజకీయ లబ్దికోసమే చిరంజీవి అలా చేస్తున్నారనే ప్రచారం సాగింది. చిరంజీవికి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సీటు రాబోతుందనే టాక్ కూడా వినిపించింది. కానీ చిరంజీవి రాజకీయ కెరీర్‌పై వస్తున్న అన్నీ ఊహాగానాలను పటాపంచలు చేస్తూ, ఇకపై రాజకీయాలకు దూ రంగా ఉంటానని తేల్చిచెప్పేశారు చిరంజీవి.
బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజాగౌతమ్‌లు లీడ్ రోల్స్‌లో నటించిన ‘బ్రహ్మా ఆనందం’ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేదికపై తన రాజకీయ కెరీర్ గురించి, మాట్లాడారు చిరంజీవి.
‘‘సినిమాలు చేసేప్పుడు నేను ఎంతో ఉత్సాహంగా ఉండేవాడిని. కానీ రాజకీయాలవైపుకు వెళ్లినప్పుడు ప్రతి రోజూ ఒత్తిడిగా ఉండేది. మనల్ని అన్నవాళ్లను, అనని వాళ్లను కూడా ఏదో ఒకటి అనాల్సి వచ్చి, తిట్లురాసుకోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో నేను నవ్వడం మర్చిపోయాను. ఏ విషయానికి సరిగ్గా స్పందచవు అంటూ ఆ సమయంలో నా భార్య సురేఖ నన్ను అనేది. నాకు హాస్యగ్రంధులు పోయాయా? అనుకున్నాను. మళ్లీ ఆ తర్వాత ‘ఖైదీనెంబరు 150’తోసినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు బాగానే ఉంది. ఇక ఈ జన్మలో రాజకీయాల్లోకి వెళ్లను. ఇటీవల రాజకీ యాలల్లోని పెద్దలకు దగ్గరగా ఉంటున్నానని, వాళ్లు కూడా నన్ను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కానీ అవి సేవా కార్యక్రమాలకు సంబంధించినవి మాత్రమే. ఇకపై రాజకీయాలకు దూరంగా, సినిమాలకు దగ్గరగా ఉంటాను. నా లక్ష్యాలను ముందుకు తీసుకుని వెళ్లడానికి పవన్‌కళ్యాణ్ ఉన్నాడు’’ అని చెప్పుకొచ్చారు చిరంజీవి.
చిరంజీవి (Chiranjeevi) తర్వాతి చిత్రం అనిల్‌రావిపూడి (AnilRavipudi) డైరెక్షన్‌లో రానుంది. ఈ సమ్మర్‌లోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ మూవీ 2026 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది.
ఈ తర్వాత తనకు వాల్తేరువీరయ్య వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన బాబీతో మరో సినిమా చేస్తారు చిరంజీవి. ఆ నెక్ట్స్ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి మూవీ ఉంటుంది. ఆపై సందీప్‌రెడ్డి వంగాతో చిరంజీవి సినిమా చేసే చాన్సెస్ ఉన్నాయి.