చిరంజీవి లీక్‌ చేసిన విశ్వంభర డీటైల్స్‌..ఇవిగో..!

Viswa
Vishwambhara Release 2026

Web Stories

చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా ఈ ఏడాది రిలీజ్‌ కావడం లేదు (Vishwambhara Release 2026). ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ సినిమాను వచ్చే ఏడాది వేసవికి రిలీజ్‌ చేస్తామని చిరంజీవి చెప్పారు. ఈ చిత్రం మేకర్స్‌ యూవీ క్రియేషన్స్‌, దర్శకుడు వశిష్ఠలు మేకింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌ పట్ల ఏ మాత్రం రాజీ పడకుండ ఈ విశ్వంభర సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకు వచ్చేందుకు కష్టపడుతున్నారని చిరంజీవి స్పష్టం చేశారు. అందుకే విశ్వంభర సినిమా రిలీజ్‌ను వచ్చే వేసవికి రిలీజ్‌ చేస్తున్నట్లుగా చిరంజీవి పేర్కొన్నారు. విశ్వంభర సినిమా రిలీజ్‌ ఆలస్యమైనా, ఈ జాప్యానికి తగ్గ ఫలితం ఆడియన్స్‌కు థియేటర్స్‌లో కలుగుతుందని భరోసా ఇస్తున్నట్లు చిరంజీవి మాట్లాడారు. విశ్వంభర సినిమా ముఖ్యంగా చిన్నపిల్లలకు నచ్చుతుందని, పెద్దవాళ్లలో చిన్నపిల్లలకు ఇంకా నచ్చుతుందని, ఓ చందమామకథలా విశ్వంభర సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక రేపు అనగా ఆగస్టు 22న చిరంజీవి బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘విశ్వంభర’ సినిమా అప్‌డేట్స్‌ను చిరంజీవి షేర్‌ చేశారు (Vishwambhara Release 2026).

ఇక ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆషికా రంగనాథ్‌, కునాల్‌కపూర్‌, రావురమేష్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, ప్రవీణ్‌, శుభలేకసుధాకర్‌, రాజీవ్‌ కనకాఔల ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక బాలీవుడ్‌ హీరోయిన్‌ మౌనీ రాయ్‌ ఈ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారు. ఈ సినిమాకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి స్వరకర్త.

పధ్నాలుగు లోకాలుదాటి హీరో సత్యలోకాని వెళ్లి, అక్కడ హీరోయిన్‌ను ఏ విధంగా కలుసుకున్నాడు? అన్న పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ‘విశ్వం భర’ సినిమా కథనం ఉంటుందని ఈ చిత్రం దర్శకుడు వశిష్ఠ పేర్కొన్నాడు. ఇంకా ఈ సినిమాలో చిరంజీవి దొరబాబు అనే పాత్రలో కనిపిస్తారని, చిరంజీవి సిస్టర్స్‌ పాత్రల్లో సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి నటించారని తెలిసింది. ఇద్దరు చైల్డ్‌ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వీరు ఈ కథకు చాలా కీలకంగా ఉంటారు.

ఇంకా ప్రస్తుతం దర్శకుడు అనిల్‌రావిపూడితో చిరంజీవి ఓ సినిమా చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి దర్శకుడు బాబీతో చిరంజీవి సినిమా ఉంటుంది. కేవీన్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మించనుంది. ఇంకా నాని నిర్మాతగా, చిరంజీవి హీరోగా ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో చిరంజీవి ఓ సినిమా చేస్తారు. కానీ ఈ చిత్రం ప్రారంభం కావడానికి చాలా సమయం ఉంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos