చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా షూటింగ్ (Vishwambhara Shoot) మొత్తానికి పూర్తయింది. ఎప్పట్నుంచో బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో చిరంజీవి, మౌనీరాయ్‌లు కలిసి సూపర్భ్ డ్యాన్స్‌లు చేశారు. బ్యాగ్రౌండ్‌లో వందమంది డ్యాన్సింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నా రు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్ రైటర్. భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట (vasisshta) డైరెక్షన్‌లో వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డిలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్. ఆషికా రంగనాథ్ , కునాల్‌కపూర్, ఇషా చావ్లా, సురభి వంటి వారు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.
ఇంత వరకు బాగానే ఉంది….కానీ ఈ సినిమా రిలీజ్ (Vishwambhara Release)ఎప్పుడన్నదే అసలు ప్రశ్న ఇప్పుడు. ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. సెప్టెంబరు లేదా అక్టోబరులో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. సీజీ వర్క్ పూర్తయితే, రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వస్తుంది. ఈ సినిమా సీజీ వర్క్ 80 శాతం పూర్తయిందని, మిగిలిన 20 శాతం సీజీ వర్క్ కూడా పూర్తయిన తర్వాత, గ్రాఫిక్స్ పట్ల చిరంజీవిగారు ఒకే చెబితే విశ్వంభర రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని ఈ చిత్రం డైరెక్టర్ వశిష్ఠ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సో…ఇప్పుడు ఈ సినిమాకు గ్రాఫిక్స్‌నే కీలకం. .

ఇప్పటికే విశ్వంభర సినిమాకు ఓవర్ బడ్జెట్ అయ్యిందటే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన విశ్వంభర టీజర్‌లోని గ్రాఫిక్స్‌ను
నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. దీంతో గ్రాఫిక్స్ వర్క్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. కేవలం సీజీలకే రూ. 25 కోట్లు ఖర్చు పెడుతున్నారట యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. అసలు..సీజీ వర్క్ ఎంత బాగా జరుగుతుంది అన్నదానికి ఈ సినిమా నుంచి ఏదైనా కంటెంట్ బయటకు వస్తే ఓ క్లారిటీ వస్తుంది. ఇలా అసలు సిసలైన చాలెంజ్ విశ్వంభరకు ముందు ఉంది. మరి..విశ్వంభర సినిమా మెగా ఫ్యాన్స్‌ను ఎంత ఖుషీ చేస్తుందో చూడాలి.
రామ్‌చరణ్ గేమ్‌చేంజర్, పవన్‌కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ సినిమాలు పెద్ద ఫ్లాప్స్ కావడంతో, విశ్వంభర సినిమాపైనే మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో విశ్వంభర రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక పవన్‌కల్యాణ్ ‘ఓజీ’, అనిల్ రావిపూడితో చిరంజీవి చేస్తున్న
మన శివశంకరవరప్రసాద్‌గారు సినిమాలపై కూడా ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.