Conditions apply for rashmika Vijay Devarakonda marriage : టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకకు సంబంధించి రోజుకో కొత్త వార్త నెట్టింట సందడి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ జంట ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయపూర్ వేదికగా వైభవంగా ఒకటవ్వబోతున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, తమ తమ షూటింగ్‌లకు చిన్న విరామం ప్రకటించి ఈ స్టార్ జంట ప్రస్తుతం ముంబైలో వివాహ పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
వీరిద్దరూ పెళ్లి గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ, ఇప్పటికే సన్నిహితులకు ఆహ్వాన పత్రికలు అందాయని, సోషల్ మీడియాలో కూడా ఒక వెడ్డింగ్ కార్డ్ తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వేడుకను కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల సమక్షంలో ఒక ప్రైవేట్ ఈవెంట్‌లా నిర్వహించాలని ఈ జంట నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ఉదయపూర్ వివాహానికి సెలబ్రిటీల సందడి పెద్దగా ఉండదని తెలుస్తోంది. అంతేకాకుండా, పెళ్లికి సంబంధించి కొన్ని కఠినమైన నిబంధనలను కూడా విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి ఫోటోలు లేదా వీడియోలు ముందుగానే బయటకు లీక్ అవ్వకుండా ఉండేందుకు ‘నో ఫోన్ పాలసీ’ని అమలు చేయబోతున్నారట.
అతిథులు ఎవరూ వేడుక జరిగే ప్రాంతంలో మొబైల్ ఫోన్లు వాడకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. ఉదయపూర్‌లో కేవలం పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య పెళ్లి ముగిసిన తర్వాత, టాలీవుడ్, ఇతర రంగాల ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. మార్చి 4వ తేదీన జరగబోయే ఈ వేడుకకు సినీ తారలు, రాజకీయ నాయకులు మరియు ఇతర రంగాల దిగ్గజాలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. ప్రైవసీని కాపాడుకుంటూనే, తమ పెళ్లిని అత్యంత చిరస్మరణీయంగా మార్చుకోవాలని ఈ క్రేజీ కపుల్ భావిస్తోంది.