డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ పై బిగ్ అప్డేట్!

Kumar NA
2 Min Read

Web Stories

Prabhas Kalki 2 update: రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పురాణ గాథలను సైన్స్ ఫిక్షన్‌తో జోడించి దర్శకుడు నాగ్ అశ్విన్ బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేయడంతో, ఇప్పుడు అందరి కళ్లు ‘కల్కి 2’ పైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే కల్కి సీక్వెల్ గురించి ఓ అదిరిపోయే అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Kalki 2898 AD Part 2 update). ‘కల్కి’ విడుదలై ఏడాది గడిచినా సీక్వెల్ అప్‌డేట్స్ లేవని కంగారు పడుతున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ (Kalki 2 shooting update). గత ఆరు నెలలుగా ఈ సినిమాకు సంబంధించిన డిజైనింగ్, గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్ పనులు సాగుతున్నాయి. ఇప్పుడు ఈ పనులన్నీ ఒక కొలిక్కి రావడంతో, ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది (Kalki 2 movie latest update).

ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, హను రాఘవపూడి ‘ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేస్తూనే, ‘కల్కి 2’ షూటింగ్‌లో కూడా పాల్గొనేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక కల్కి మొదటి భాగంలో సస్పెన్స్‌గా వదిలేసిన ప్రశ్నలకు సీక్వెల్‌లో సమాధానాలు లభించనున్నాయి. కాగా రీసెంట్ గానే వ్యక్తిగత కారణాల వల్ల దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో ఏ అగ్ర కథానాయికను తీసుకుంటారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది (Kalki 2 release date update).

ఈ భారీ గ్రాఫిక్స్ వండర్‌ను 2028 నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్ట్-2లో విజువల్స్, వార్ సీక్వెన్స్ మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో ఉంటాయని టాక్. ‘కల్కి 2’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు షూటింగ్ ప్రారంభం కాబోతుందనే వార్త పెద్ద ఊరటనిచ్చింది. ఈసారి కర్ణుడిగా ప్రభాస్ విశ్వరూపాన్ని చూడబోతున్నామన్న అంచనాలు ఆడియన్స్ లో ఇప్పటికే భారీగా ఉన్నాయి.

 

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi