ఇది కదా..క్రేజీ కాంబినేషన్‌ అంటే …సంక్రాంతికి నవ్వుల జాతర

Viswa
2 Min Read

Web Stories

NTRxAnilRavipudi Movie: హీరో ఎన్టీఆర్ (NTR), అనిల్‌రావిపూడి ( Director AnilRavipudi) కాంబినేషన్‌తో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. ఎన్టీఆర్‌ వరుస చిత్రాల నిర్మాణంలో భాగం అవుతున్న ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ, ఈ సినిమాకు సోలో ప్రొడక్షన్‌ హౌస్‌గా వ్యవహ రించనుండటం విశేషం. అంటే…ఎన్టీఆర్‌–అనిల్‌రావిపూడి కాంబినేషన్‌లోని సినిమాకు కళ్యాణ్‌రామ్‌ ఒక్కరే నిర్మాతగా ఉంటారు. ఇది పూర్తి వినోదాత్మక సినిమా అని అనిల్‌రావిపూడి చెప్పగా, ఈ సినిమా నవ్వుల జాతరలా ఉంటుందని ఎన్టీఆర్‌ తెలిపారు. ఇక వరుస యాక్షన్‌ సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి, ఎన్టీఆర్‌ ఓ వినోదా త్మక సినిమా  (NTRxAnilRavipudi ) చేసేందుకు సిద్ధం అవుతుండటం కూడా ఆయన అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది.

2028 సంక్రాంతికి సినిమా

ఇక ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించాలని అనుకుంటున్నారు మేకర్స్‌. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లోని ‘డ్రాగన్‌’ సినిమాతో బిజీగా ఎన్టీఆర్‌ ఉన్నారు. మరోవైపు వెంకటేశ్‌– కళ్యాణ్‌రామ్‌ల మల్టీస్టారర్‌ మూవీ ‘జనవరి 12 విడుదల’ చిత్రంతో అనిల్‌రావిపూడి బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు వారి ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ పూర్తి చేసుకున్న తర్వాత వీరి కాంబినేషన్‌లోని సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌ టైమ్స్‌లో అనిల్‌రావిపూడి సినిమాలు సంక్రాంతి పండక్కే రిలీజ్‌ అవుతున్న తరుణంలో 2028 సంక్రాంతికి ఎన్టీఆర్‌–అనిల్‌రావిపూడి కాంబినేషన్‌లోని సినిమా రావొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.

NTR And Trivikram God of war Movie: ఆల్‌ ఈజ్‌ వెల్‌

ఆలస్యంగా త్రివిక్రమ్‌ సినిమా

డ్రాగన్‌ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌ సినిమా చేయాలి. తమిళ దర్శకుడు నెల్సన్‌తో కూడా ఒక కమిట్‌మెంట్‌ ఉంది. కానీ ఇప్పుడు సడన్‌గా అనిల్‌రావిపూడితో సినిమాను ప్రకటించారు ఎన్టీఆర్‌. ‘డ్రాగన్‌’ తర్వాత ఎన్టీఆర్‌ చేయబోయే ఇమ్మిడియేట్‌ ప్రాజెక్ట్‌ ఇదే. సో..త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌ చేయనున్న మైథాలజీ డ్రామాసెట్స్‌కు వెళ్లడానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఒకవేళ ఈ రెండు చిత్రాలకు ఒకేసారి సెట్స్‌కు తీసుకు వెళ్దామని అనుకున్న, లుక్స్‌ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో..ముందుగా అనిల్‌రావిపూడి సినిమాను ఎన్టీఆర్‌ కంప్లీట్‌ పూర్తి చేసిన తర్వాతే, త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌ సినిమా సెట్స్‌కు వెళ్తుందని ఊహించవచ్చు.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah