రీ రిలీజ్‌లలో టాప్‌ ప్లేస్‌ కోసం ఆ హిందీ సినిమాలను దాటాల్సిందే!

Viswa

Web Stories

Baahubali:The Epic ReRelease: టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌లో ప్రభాస్‌ ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’దే ఫస్ట్‌ప్లేస్‌. ఇప్పుడు రీ రిలీజ్‌ కలెక్షన్స్‌లోనూ బాహుబలిదే టాప్‌ ప్లేస్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

రాజమౌళి (BaahubaliTheEpic Director SSRajamouli) దర్శకత్వంలో  ప్రభాస్‌ (Baahubalithe Epic Hero Prabhas) హీరోగా, రానా, తమన్నా, అనుష్కా శెట్టి, నాజర్, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ సినిమా రెండు పార్టులుగా విడుదలైంది. తొలిపార్టు ‘బాహు బలి: ది బిగినింగ్‌’ పేరిట 2015లో ప్రేక్షకుల ముందకు వచ్చి, సూపర్‌హిట్‌గా నిలవగా, మలి పార్టు ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’గా 2017లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఇప్పుడు ‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్‌’…ఈ రెండు సినిమాలనూ కలిపి, ‘బాహు బలి: ది ఎపిక్‌’ (Baahubali:The Epic ReRelease)గా, ఈ అక్టోబరు 31న రిలీజ్‌ (Baahubali:The Epic ReRelease Release date) చేస్తాన్నారు. ‘బాహుబలి:ది బిగినింగ్‌’ సినిమా విడుదలై, పదేళ్లు పూర్తయిన సందర్భంగా ‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమాను రీ రిలీజ్‌లా ప్రేక్ష కుల ముందకు తీసుకువస్తున్నారు. ఆల్రెడీ తెలుగు, తమిళం, హిందీ, మల యాళం, కన్నడం భాషల్లో ఈ ‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. బుకింగ్స్‌ బాగా జరుగు తున్నాయి. అనూహ్యంగా ఓవర్‌సీస్‌ నుంచి కూడా మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభిస్తోంది. ఈ తరుణంలో రీ రిలీజ్‌ల విషయంలో ‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేయవచ్చని, ట్రెడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదే నిజమైతే, తెలుగులో రీ రిలీజ్‌ల పరంగా హాయ్యెస్ట్‌ కలెక్షన్స్‌ సాధించిన మహేశ్‌ ‘ఖలేజా’ సినిమా రికార్డు తుడిచిపెట్టుకుపోతుంది. బాహుబలి ది ఎపిక్‌ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తుంది. ఇలా రీ రిలీజ్‌ల పరంగానూ బాహుబలి ది ఎపిక్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంటుంది.

ఇక రీ రీలీజ్‌ల అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన సినిమాలుగా తొలి రెండు స్థానాల్లో ‘సనమ్‌ తేరీ కసమ్, తుంబాడ్‌ (Tumbbad ReRelease)’ సినిమాలు ఉన్నాయి. సనమ్‌ తేరీ కసమ్‌ సినిమా ఈ ఏడాది రీ రిలీజై, దాదాపు 50 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను సాధించగా, తుంబాడ్‌ దాదాపు రూ. 40 కోట్ల రూపాయలను (Tumbbad ReRelease Collections)కలెక్ట్‌ చేసింది. ఇలా ‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమా రీ రిలీజ్‌ల విషయంలో హాయ్యెస్ట్‌ కలెక్షన్స్‌ సాధించిన సినిమాగా నిలిచే అవకాశాలు లేకపోలేదు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos