Ram Charan next film: ‘గేమ్‌చేంజర్’ సినిమాకు మూడేళ్లకుపైనే టైమ్ కేటాయించాడు రామ్‌చరణ్. శంకర్ డైరెక్షన్‌లోని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్రజెంట్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు రామ్‌చరణ్.
చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను రిలీజ్ చేయాలన్నది ప్లాన్. కానీ ఈ సినిమా షూటింగ్ కాస్త స్లో అయ్యింది. పోనీ తాను ఆల్రెడీ కమిటైన సుకుమార్‌తో సిని మాను స్టార్ట్ చేద్దామనుకుంటే, సుకుమార్ దగ్గర ఇంకా బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ కాలేదట. ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్‌తో సుకుమార్ చేయాల్సిన సినిమా కనుక, ఆడియన్స్‌లో అంచనాలు ఉంటాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగా, కథను రెడీ చేసేందుకు మరికొంత సమయం అడిగారట సుకుమార్.
బాలీవుడ్ ‘కిల్’ ఫేమ్ నిఖిల్ భట్‌తో సినిమాను స్టార్ట్ చేయడానికి, ఆయన హాలీవుడ్‌లో ఓ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్‌తో రామ్‌చరణ్ ఓ సినిమా చేస్తారు. కానీ ప్రజెంట్ వెంకటేష్‌తో చేయాల్సిన సినిమాతో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. ఇలా రామ్‌చరణ్ కాస్త డైలామాలో పడ్డారట. కానీ ‘పెద్ది’ సినిమాపై చరణ్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారట.
పెద్ది సినిమాలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తుండగా, జగపతిబాబు, దివ్వేందు శర్మ, శివరాజ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరకర్త.