Dacoit Release: దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అడివి శేష్ నుంచి థియేటర్స్‌లోకి రాబోతున్న తాజా సినిమా ‘డెకా యిట్’. ఈ సినిమాను తొలుత డిసెంబరు 25న రిలీజ్ చేయాల నుకున్నారు. కానీ ఆ తర్వాత మార్చి 19కి వాయిదా వేశారు.
కానీ ‘డెకాయిట్’ యూనిట్ ప్రకటించడానికి ముందే ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ తన ‘టాక్సిక్’ సినిమాను మార్చి 19న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. మరోవైపు రణ్‌బీర్‌కపూర్ – ఆలియాభట్ – విక్కీ కౌశల్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ సినిమా కూడా మార్చి 19నే రిలీజ్ కానుంది.
ఈ తరుణంలో అడివి శేష్ ‘డెకాయిట్’ సినిమా రిలీజ్ మార్చి 19 ఉంటుందా? లేదా? అనే డౌట్స్ తెరపైకి వచ్చాయి. తెలుగు వరకు అయితే ‘డెకాయిట్’ సినిమాకు ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ ఈ ‘డెకాయిట్’ సినిమాను తెలుగుతో పాటుగా, హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
టాక్సిక్, లవ్ అండ్ వార్…సినిమాలు మార్చి 19న రిలీజ్‌కే ఫిక్స్ అయితే..డెకాయిట్ సినిమా వా యిదా పడక తప్పదు. లేదని పోటీకి పోతే..కలెక్షన్స్ మాత్రం తప్పకుండ ప్రభావితం అవు తా యి. సాధారణంగా ఈద్ పండక్కి (తెలుగులో ఉగాది పండగ సందర్భం), సల్మాన్ ఖాన్ సినిమాలు ఎక్కువగా బాలీవుడ్‌లో రిలీజ్ అవుతుంటాయి.
ప్రజెంట్ సల్మాన్‌ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా చేస్తున్నారు. ఒకవేళ సల్మాన్‌ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ కూడా ఈద్ రిలీజ్‌కు రెడీ అయితే, అప్పుడు రిలీజ్ లెక్కలన్నీ మారిపోతాయనడంలో సందేహం లేదు. మరి..ఏం జరుగుతుందో చూడాలి.