Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే రకరకాల వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి సెన్సేషనల్ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మన భల్లాలదేవ దగ్గుపాటి రానా ఒక పవర్‌ఫుల్ రోల్‌లో నటించబోతున్నట్లు సమాచారం. సాధారణంగా అట్లీ సినిమాల్లో హీరో ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో, విలన్ లేదా మరో కీలక పాత్ర కూడా అంతే బలంగా ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రానా పాత్ర కేవలం ఒక అతిథి పాత్రలా కాకుండా, కథను మలుపు తిప్పే ఒక కీలకమైన రోల్ అని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే అల్లు అర్జున్ మాస్ స్వాగ్ కు రానా గంభీరమైన నటన తోడైతే వెండితెరపై ఆ మ్యాజిక్ వేరే లెవల్‌లో ఉంటుందని చెప్పొచ్చు.
ఇకవ్యక్తిగతంగా బన్నీ, రానా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. గతంలో ‘రుద్రమదేవి’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ కాంబో బిగ్ స్క్రీన్ పై సందడి చేయనుంది. కాగా ఈ సినిమాలో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటాయని టాక్. ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అట్లీ, ఇప్పుడు అల్లు అర్జున్ కోసం ఒక యూనివర్సల్ అప్పీల్ ఉన్న స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు. వీరద్దరి కాంబో సెట్ అయితే, ఇది సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మల్టీస్టారర్లలో ఒకటిగా నిలుస్తుంది. అయితే అధికారికంగా దీనిపై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.