జపాన్ యానిమేషన్ సినిమా ‘డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్’ (Demon Slayer: Kimetsu No Yaiba Infinity Castle)కు ఇండియాలో మంచి క్రేజ్ లభిస్తోంది. ఈ సినిమా సెప్టెంబరు 12న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. కానీ ఇప్పటికే ఈ సిని మాకు లక్ష టికెట్స్‌కు పైగా బుక్ కావడం, అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జపాన్ సినిమాకూ, అదీ యానిమేషన్ సినిమాకూ ఇండియాలో ఇంతటీ క్రేజా? అని ట్రేడ్ వర్గీయులు సైతం నమ్మశక్యం కానీ విషయం అంటూ మాట్లాడుతున్నారు. విశేషం ఏంటంటే…డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్’ సినిమా తెలుగులోనూ రిలీజ్ కానుంది. ‘డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్’ ప్రజెంట్ ఈ సినిమా మేజర్‌గా మల్టీఫ్లెక్స్‌లోనే రిలీజ్ అవుతోంది. మంచి పాజిటివ్ మౌత్‌టాక్ ఉంటే, సింగిల్ స్క్రీన్స్‌లోనూ విడుదల కావొచ్చు. ఇటీవలే ఇంగ్లీష్ ‘ఎఫ్1’ చిత్రం విడుదలై,రూ. వంద కోట్లను కొల్లగొట్టింది. ఇప్పుడు జపాన్ చిత్రం ‘డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్’ ఇండియాలో ప్రీ సేల్స్ విషయంలో దుమ్మురేపుతోంది.సోనీ సంస్థ ఈ సినిమాను ఇండియాలో రిలీజ్ చేస్తోంది. 750కి పైగా స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
టాలీవుడ్ చూపంతా ‘కాంతార’ ప్రీక్వెల్‌వైపే..!
‘డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్’ చిత్రం జపాన్‌లో జూలై 18న విడుదలైంది. జపాన్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం ఇదే కావడం విశేషం. అంతే కాదు… జపాన్ బాక్సాఫీస్ కలెక్షన్ హిస్టరీలో టాప్ 5లో నిలిచిందీ చిత్రం. ఇప్పుడు మెల్లగా ఇతర దేశాల్లోనూ రిలీజ్‌కు సిద్ధమైంది. దీంతో…‘డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్’ సినిమా జపాన్ బాక్సాఫీస్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
రీసెంట్‌గా వచ్చిన ఇండియన్ యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ రూ. 30 కోట్లతో నిర్మించబడి, రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ‘డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్’ వంటి యానిమేషన్ సినిమాకు మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. మరోవైపు సెప్టెం బరు 12నే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన హారర్ ఫిల్మ్ ‘కిష్కింధపురి’ రిలీజ్ అవుతోంది. తేజా సజ్జ ‘మిరాయ్’ చిత్రం కూడా ఇదే రోజు విడుదల అవుతోంది.