కథ
Dhanush JabilammaNeekuAnthaKopama Movie Review: చెఫ్ ప్రభు (పవీష్), ప్రీతి (ప్రియా ప్రకాష్‌వారియర్) పెళ్లిచేసుకోవాలనుకుంటారు. ఇదే సమయంలో తన మాజీ ప్రేయసి నీలా కరుణాకరన్ (అనిఖా సురేంద్రన్) నుంచి, ఆమె వెడ్డింగ్ ఇన్విటేషన్ వస్తుంది. ఈ విషయం ప్రీతికి చెప్పి, తన లవ్‌స్టోరీ మొత్తం చెబుతాడు. పెళ్లి చేసుకునేముందు మైండ్‌లో అంతా క్లియర్‌గా ఉండాలని, మనసులో ఏం పెట్టుకోవద్దని, నీలా పెళ్లికి వెళ్లిరమ్మని ప్రభుకి చెబుతుంది ప్రీతి. దీంతో తన స్నేహితుడు రాజేష్ (మాథ్యాథామస్)తో కలిసి నీలా డెస్టినేషన్ వెడ్డింగ్‌కి వెళ్తాడు ప్రభు. అసలు..ప్రభు, నీలాలు ఎలా ప్రేమించుకుని, ఎందుకు విడిపోయారు? ప్రభు–నీలల లవ్‌కు..మరో ప్రేమజంట శ్రియ (రబియా)– రవి (వెంకటేష్ మీనన్)లు ఏ విధంగా హెల్ప్ చేశారు. ప్రభుకి వెడ్డింగ్ ప్లానర్ అంజలి(రమ్య రంగనాథన్) ఏ విధంగా దగ్గరైంది? ప్రభు లవ్‌కి, నీలా తండ్రి కరుణాకరున్ ఏ విధంగా అడ్డుపడ్డాడు? అనేది మిగిలిన కథాంశం (Nilavuku En Mel Ennadi Kobam Telugu Review)
విశ్లేషణ
ఈ సినిమాకు (NEEKReview) ధనుష్ (Dhanush) డైరెక్షన్ చేశాడు. సినిమా స్టార్టింగ్‌లోనే ‘డోన్ట్ టు మచ్ ఎక్స్‌ఫెక్ట్..ఓ నార్మల్ లవ్‌స్టోరీ’ అంటూ ఓ డైలాగ్ వస్తుంది. ఇందుకు తగ్గట్లుగానే ఈ సినిమా స్టార్టింగ్‌లో చాలా నార్మల్‌గా ఉంటుంది. ఓ రోటీన్ లవ్‌స్టోరీలా మొదలవుతుంది. కానీ ఈ కథలో ఉన్న హీరో బ్రేకప్, ఎమో షన్స్‌కి మంచి హ్యూమర్ యాడ్ చేసి ఆడియన్స్‌కు బోర్ కొట్టనివ్వకుండ ఉండటంతో దర్శకుడుగా ధనుష్ సక్సెస్ అయ్యాడు. తొలి భాగంలో వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ఊహకు తగ్గట్లుగానే ఉన్నప్పటీకిని, స్క్రీన్‌పై కనిపించే యూత్‌ఫుల్ కామెడీ ఆడియన్స్‌కు బోర్ కొట్టనివ్వదు. ముఖ్యంగా పవీష్, మాథ్యూ థామస్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఆడియన్స్‌ను బాగా అలరిస్తాయి. అంతర్లీనంగా ఉండే వీరి ట్రూ ఫ్రెండ్‌షిఫ్ ఈ సినిమాకు మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు.
హీరో తన మాజీ ప్రేయసి పెళ్లికి వెళ్లడంతో ఈ సినిమా తొలిభాగం ముగుస్తుంది. మాజీ ప్రేయసి డెస్టినేషన్ వెడ్డింగ్ సీన్స్‌తో సెకండాఫ్ సాగుతుంది. మెహందీ, సంగీత్, హల్దీ, పెళ్లి…ఇలా డెస్టినేషన్ వెడ్డింగ్ సెల బ్రేషన్స్‌లోని నాలుగు విభాగాలను నాలుగు రోజులుగా చేసి, ఒక్కో ఎసిసోడ్‌లో కొంచెం కొంచెంగా హీరో హీరోయిన్లను దగ్గర చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ క్రమంలో వచ్చే ఎమోషన్స్, కామెడీ ట్రాక్ ఆడియన్స్‌ను బాగా అలరి స్తుంది. ఫస్టాఫ్‌లో అలరించిన మాథ్యాథామస్ కామెడీ టెంప్ సెకండాఫ్‌లోనూ, సూపర్భ్‌గా కొనసాగింది. ఈ మాథ్యాథామస్ క్యారెక్టర్‌కు ఉండే లవ్ ట్రాక్ కూడా ఆడియన్స్‌ను నవ్విస్తుంది. క్లైమాక్స్‌ను కూడా రోటీన్‌గా కాకుండ కొత్తగా చూపించి, పార్టు 2 లీడ్ వదలడం బాగుంది.
కానీ నీలాకు ప్రభు ఎందుకు దూరమైయ్యాడన్న సంగతి, ప్రభు ఫ్రెండ్ రాజేష్‌కు తెలుసు. కానీ తను ఎవరికీ ఎందుకు చెప్పడో ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ కాదు. సెకండాఫ్‌లో వచ్చే అంజలి క్యారెక్టర్‌ను ఏదో బలవంతంగా ఇరికిచ్చినట్లుగా ఉంటుంది. తనను దూరం చేసుకుంటే..ఇక లైఫ్‌లో నన్ను కలవలేవు అంటూ చెప్పిన నీలా.. మళ్లీ ప్రభు ఇంటికి ఎందుకు వెడ్డింగ్ కార్డు పంపిస్తుందన్న క్లారిటీ లేదు. ఇలా…ఒకట్రెండు మైనస్‌లు ఉన్నా..
వీటిని యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కనపడకుండ చేస్తుంది. తమ లవ్‌బ్రేకప్‌లను తలచుకుని హీరో, అతని ఫ్రెండ్ ..ఒకరినొకరు ఓదార్పుకునే సీన్స్, సెకండాఫ్‌లో పిచ్చిగా డ్యాన్స్ చేయడం…వంటి సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.
పెర్ఫార్మెన్స్
ప్రభుగా పవిష్ (Pavish) యాక్టింగ్ బాగా చేశాడు. కామెడీ టైమింగ్ బాగుంది. ఎమోషనల్ సీన్స్‌లో ఫర్వాలేదు. కానీ సెకండాఫ్‌లో ఎక్కువగా కళ్లజోడుతో కనిపించడమే బాగోలేదు. ఇక హీరో ఫ్రెండ్ రాజేష్ పాత్రలో మాథ్యా థామస్ నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ చేశాడు. సినిమాలోని మేజర్ కామెడీ పార్టు మోసింది ఇతనే. నీలాగా అనిఖా సురేంద్రన్ ఫర్వాలేదు. ఎమోషనల్ సీన్స్‌లో మరికొంత పరిణీతి చూపించాల్సిన అవసరం ఉంది. నీలా ఫ్రెండ్ శ్రియగా రుబియాకు మంచి రోల్ దక్కింది. శ్రియ లవర్ రవిగా వెంకటేష్ మీనన్ రోల్ ఒకే. ఇక సెకండాఫ్‌లో వెడ్డింగ్ ప్లానర్‌గా వచ్చే రమ్య రంగ నాథన్ ఉన్నంతలో బాగానే చేశారు. ప్రభు అమ్మ నాన్నలుగా, సీనియర్ యాక్ట్రస్ శరణ్య–ఆడుకాలం నరైన్‌ల పాత్రలు చాలా తక్కువ నిడివి. అయితే ఒకట్రెండు సీన్స్ శరణ్య కామెడీ పంచ్‌లు బాగానే పేలాయి. ఇక ఈ మూవీలో కథను మలుపుతిప్పే పాత్ర కరుణాకరన్‌గా ఆర్. శరత్‌కుమార్ యాక్టింగ్ మెప్పిస్తుంది. ఓ సీనియర్ యాక్టర్‌గా తానెంటో నిరూపించు కున్నారు.ప్రీతిగా ప్రియాప్రకాష్‌వారియర్ రోల్ కాస్త మెచ్చూర్డ్‌గా ఉంటుంది. ఫస్టాఫ్‌లో ఫస్ట్, సెకండాఫ్‌లో లాస్ట్‌లో కనిపిస్తుంది. యాక్టింగ్‌కు స్కోప్ తక్కువ ఉన్న క్యారెక్టర్.
ఈ సినిమాకు మరో ప్రధానబలం జీవీప్రకాష్‌కుమార్ మ్యూజిక్. మంచి ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు. సెకం డాఫ్‌లో సంగీత్‌లో వచ్చే ‘గోల్డెన్‌స్పారో’ సాంగ్‌లో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్, మరో సాంగ్‌లో జీవీ ప్రకాష్‌కుమార్‌లు గెస్ట్‌గా కనిపించారు. వుండర్‌బార్ ఫిలింస్, ఆర్‌కే ఫిలింస్‌ల నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రసన్న ఎడింట్ ఒకే. ఫస్టాఫ్‌లో కొంత కట్ చేయవచ్చు. లియోన్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ట్రెండీగా ఉన్నాయి.
బాటమ్ లైన్స్: డోన్ట్ ఎక్స్‌ఫెక్ట్ టు మచ్ లవ్‌స్టోరీ….బట్ ఆడియన్స్ విల్ ఎంటర్‌టైన్ సో మచ్
రేటింగ్: 2.75/5
సినిమా: జాబిలమ్మా నీకు అంత కోపమా..!
ప్రధానతారాగణం: పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్‌వారియర్, మాథ్యాథామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్
దర్శకత్వం: ధనుష్
నిర్మాణం: ధనుష్ వండర్‌బార్ ఫిలింస్, ఆర్‌కే ప్రొడక్షన్స్
మ్యూజిక్: జీవీ ప్రకాష్‌కుమార్
ఎండిటింగ్:జీకే ప్రసన్న
కెమెరా: లియోన్ బ్రిట్టో
విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 2025
నిడివి: 2 గంటల 11 నిమిషాలు