రామ్‌చరణ్ (Ramcharan) కెరీర్‌లో ‘గేమ్‌చేంజర్’ బిగ్ ఫ్లాఫ్ మూవీగా నిలిచింది. ‘దిల్’ రాజు (Producer DilRaju) సొంత నిర్మాణసంస్థ శ్రీవెంకటేశ్వరక్రియేషన్స్ పతాకంపై నిర్మించబడిన ఈ సినిమా ఈ బ్యానర్‌లో 50వ చిత్రం. శంకర్ (Director Shankar) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. కియారా అద్వానీ, అంజలి, నవీన్‌చంద్ర, శ్రీకాంత్, జయరామ్, ఎస్‌జే సూర్య…ఇలా ప్రముఖ క్యాస్టింగ్ ఉన్నప్పటికీని ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. తాజాగా ‘గేమ్‌చేంజర్’ సినిమా ప్లాప్‌పై నిర్మాత ‘దిల్’ రాజు స్పందించారు. గేమ్‌చేంజర్’ సినిమా తన కెరీర్‌లోనే బిగ్ రాంగ్ స్టెప్ అని చెప్పుకొచ్చారు. అలాగే ‘గేమ్‌చేంజర్’ (Game changer) సినిమా నిడివి 4 గంటలకుపైగా వచ్చిందని, ఈ సినిమాను ఎడిట్ చేయడం తనకు పెద్ద కష్టం అయిపోయిందని ‘గేమ్‌చేంజర్’ ఎడిటర్ చెప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి (DilRaju Comments on Gamechanger). తాజాగా ‘గేమ్‌చేంజర్’ చేసిన ఆ వ్యాఖ్యలపై ‘దిల్’ రాజు స్పందించారు.
”బిగ్ డైరెక్టర్స్, బిగ్ సినిమాలు చేసినప్పుడు వందశాతం ఆ సమస్య (సినిమా నిడివి) ఉంటుంది. ‘గేమ్‌చేంజర్’ సినిమా నిడివి నాలుగున్నర గంటలు అని ఎడిటర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ నిజం. అయితే ఓ పెద్ద దర్శకుడు సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువ ఇన్‌వాల్వ్ కాలేం. అయితే ఏంటి ప్రాబ్లమ్ అంటే డైలీ కిచిడి. డైలీ కిచిడి చేసుకోవాలా? లేక మొత్తం అయిపోయిన తర్వాత చూసుకోవాలి? అనుకోవాలా? అప్పు జరిగేటప్పుడు ఆపాల్సిన బాధ్యత నిర్మాతదే. కానీ ఆపలేకపోయానంటే అది నా ఫెయిల్యూర్. నేను ఒప్పుకోవాలి. నేను అసలు అలాంటి ప్రాజెక్ట్ ఎత్తుకోకూడదు. నిర్మాతగా 60 సినిమాలు తీశాను నేను. కానీ నా కెరీర్‌లో పెద్ద దర్శకులతో సినిమా లేవు. అలా కాకుండ శంకర్ వంటి పెద్ద దర్శకుడితో సినిమా ప్లాన్ చేయడం నా ఫస్ట్ రాంగ్ స్టెప్. పెద్ద దర్శకుడితో సినిమా అన్నప్పుడు కాంట్రాక్ట్ బాగా రాసుకుని, కొన్ని పాయింట్స్ పెట్టుకుని వెళ్లాలి. వెళ్లలేదు. అది నా తప్పు. అది మన స్కూల్ కాదు..అలాంటప్పుడు ఆలోచించి కూడా వేస్ట్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి పెద్ద సినిమా తర్వాత రామ్‌చరణ్‌కు ఓ మంచి హిట్ ఇవ్వలేకపోయాననే బాధ నాకు ఉంది. భవిష్యత్‌లో రామ్‌చరణ్ తో సినిమా చేస్తాను” అని చెప్పుకొచ్చారు ‘దిల్’ రాజు (Producer DilRaju)
ఇక ‘దిల్’ రాజు నిర్మించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ జూలై4న విడుదల కానుంది. నితిన్ హీరోగా చేసిన ఈ మూవీకి శ్రీరామ్ వేణు దర్శకుడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ‘దిల్’ రాజు ‘గేమ్‌చేంజర్’ సినిమాను గురించిన ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు. ఇంకా ‘తమ్ముడు’ సినిమా ప్రొడక్షన్‌కే రూ.35 కోట్ల రూపాయాలు అయ్యిందని, అప్పట్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశానని, ఇప్పుడైతే చేయకపోదనని చెప్పుకొచ్చారు. నానితో ఈ మూవీ చేయాలనుకున్నామని, కానీ నాని బిజీగా ఉండటం వల్ల కుదరలేదని కూడా ‘దిల్’ రాజు మెన్షన్ చేసినట్లు వార్తలు ఉన్నాయి.