హిట్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి (AnilRavipudi) కెరీర్‌లో ఓ మంచి చాన్స్ మిస్సయ్యింది. అనిల్ కెరీర్‌లో, బాలకృష్ణతో చేసిన ‘భగవంత్‌సింగ్ కేసరి’ మూవీ సూపర్‌హిట్. అయితే ఈ సినిమా తమిళ హీరో విజయ్‌కు బాగా నచ్చిందంట. దీంతో రీమేక్ చేయ్యాలని డిసైడ్ అయ్యారు. అనిల్‌రావిపూడితో సంప్రదింపులు జరిపారు.కానీ తమిళ స్టార్ హీరో విజయ్‌కు అనిల్ నో చెప్పారు. వెంకటేశ్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ చేయాలని అనిల్ రావిపూడి విజయ్‌కు నో చెప్పారు. విజయ్ కెరీర్‌లోని చివరిగా హె. వినోద్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటుంది. ఈ మూవీ ‘భగవంత్ కేసరి’ చిత్రానికి తమిళ రీమేక్‌గా రూపొందుతుందని, శనివారం జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మ్యూజికల్ నైట్ ప్రెస్‌మీట్‌లో బయటకు వచ్చింది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో ఓ కీ రోల్ చేసిన వీటీవీ గణేష్ ఈ విషయాలను పరోక్షంగా బయటపెట్టారు.
Ramcharan GameChanger Movie Review: రామ్‌చరణ్ గేమ్‌ఛేంజర్ మూవీ రివ్యూ
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) మూవీ హీరో వెంకటేశ్‌తో అనిల్ రావిపూడి ఆల్రెడీ ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాలను చేశారు. అలాగే ఈ చిత్రం నిర్మాత ‘దిల్’ రాజుతో అనిల్‌రావిపూడికి మంచి అసోసియేషన్ ఉంది. వీరి కాంబినేషన్‌లో ‘రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్ 3’ వంటి సినిమాలొచ్చాయి. సో…వెంకటేశ్, ‘దిల్’ రాజుల కోసం విజయ్‌కు అనిల్ నో చెప్పారని ఊహింవచ్చు. అయితే తెలుగులో హిట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్, విజయ్‌తో మూవీ చేసినట్లయితే, తమిళంలోనూ ఆయన మార్కెట్ పెరిగి ఉండేది. మరి…ఎందుకో గానీ విజయ్ అలా చేయలేదు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా…ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది
ramcharan: చరణ్‌పై ఇంత వ్యతిరేకతా?