తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj ) మంచి ఫామ్‌లో ఉన్నారు (lokesh kanagaraj movies). దర్శకుడిగా, రైటర్‌గా, నిర్మా తగా,హీరోగా సినిమాలు చూస్తే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఇప్పటివరకు కార్తి ‘ఖైదీ 2’,కమల్‌హాసన్ ‘విక్రమ్’ వంటి సినిమాలతో దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ అందరికీ తెలుసు. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రస్తుతం ‘కూలీ’ (Coolie Release) సినిమా చేస్తున్నాడు. రజనీకాంత్ హీరోగా చేసిన ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కానుంది. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ మూవీ తర్వాత కార్తీతో ‘ఖైదీ 2’ సినిమాను స్టార్ట్ చేస్తాడు లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj ). ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదే ప్రారంభం అవుతుంది. ‘ఖైదీ 2’ పూర్తయిన తర్వాత కమల్‌హాసన్‌తో ‘విక్రమ్ 2 (vikram2)’ చేస్తాడు లోకేష్. ఇలా… లోకేష్ నెక్ట్స్ త్రీ ఇయర్స్ డైరెక్టర్‌గా బిజీగా ఉంటాడు.
lokesh kanagaraj movies: హీరోగా లోకేష్ కనగరాజ్
ఇన్నిరోజులు డైరెక్టర్‌గా అలరించిన లోకేష్ కనగరాజ్ హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. తమి ళ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ (కెప్టెన్ మిల్లర్ ఫేమ్) డైరెక్షన్‌లో లోకేష్ కనగరాజ్ హీరోగా ఓ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. లోకేష్ కనగరాజ్‌యే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
lokesh kanagaraj movies: రైటర్…ప్రొడ్యూసర్!
జీస్క్వాడ్ బ్యానర్‌లో లోకేష్ కనగరాజ్ ఆల్రెడీ కొన్ని సినిమాలను నిర్మించాడు. లేటెస్ట్‌గా రాఘ వా లారెన్స్ హీరోగా ‘బెంజ్’ (benz movie)సినిమాకు ఓ నిర్మాతగా ఉన్నాడు లోకేష్ కనగరాజ్. లొకేష్ ఎల్‌సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)లో భాగంగా ఈ మూవీ రానుంది. ఈ సినిమాకు కథ కూడా లోకేష్ కనగరాజ్‌యే అందించడం విశేషం. ఈ బెంజ్ మూవీలో రాఘవా లారెన్స్‌తో పాటుగా, మాధవన్, నివిన్ పౌలీలు కూడా ఇతర ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ బెంజ్ మూవీ రాఘవా లారెన్స్ కెరీర్‌లో 25వ చిత్రం కావడం మరో విశేషం. బక్కియరాజ్ కన్నన్ (Benz Movie Director) బెంజ్ (Benz) సినిమాకు దర్శకుడు.