దర్శకుడు శేఖర్‌కమ్ములతో (Sekhar Kammula Next Movie) నాని సినిమా (Hero Nani) అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ‘కుబేర’ సినిమా ప్రమోషన్స్‌లో, దర్శకుడు శేఖర్‌కమ్ముల (Sekhar Kammula) కూడా నానితో సినిమాను పరోక్షంగా కన్ఫార్మ్ చేశాడు. ఇంకా వర్క్ జరగాల్సి ఉందన్నట్లుగా చెప్పుకొచ్చాడు. కానీ దర్శకుడు శేఖర్ కమ్ముల నెక్ట్స్ మూవీ నాని (Hero Nani) తోనే ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయిపోతుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
ఇటీవల ‘కుబేర’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు శేఖర్‌కమ్ముల. పైగా తన రోటీన్ సినిమాల కంఫర్ట్‌జోన్‌ని బ్రేక్ చేసి, శేఖర్‌కమ్ముల ఈ సినిమా హిట్ అందుకున్నారు. దీంతో వరుస యాక్షన్ సినిమాలు చేస్తున్న నాని కూడా కాస్త డిఫరెంట్‌గా ఉండేలా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ చేయాలనుకుంటున్నాడు. ఈ దశలో శేఖర్‌కమ్ములకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట నాని.
శేఖర్‌కమ్ములతో ప్రముఖ నిర్మాతలు సునీల్ నారంగ్ (Producer sunil narang), పుస్కూర్ రామ్మోహన్‌లు మూడు సినిమాల డీల్ కుదుర్చుకున్నారనే వార్తలు ఉన్నాయి. ఈ వార్తలు నిజమే అన్నట్లుగా ఈ నిర్మాతలోనే శేఖర్‌కమ్ముల ఇప్పటికే రెండు సినిమాలు లవ్‌స్టోరీ, కుబేర చేశాడు. ఇప్పుడు మూడో సినిమా కూడా ఈ బ్యానర్‌లోనే కన్ఫార్మ్ అయిపోయింది. తమ బ్యానర్‌లోని నెక్ట్స్ మూవీకి శేఖర్ కమ్ములయే దర్శకత్వం వహిస్తారని ఇటీవల నిర్మాత సునీల్ నారంగ్ …‘కుబేర’ సినిమా ప్రమోషన్స్‌లో చెప్పారు. ఈ చిత్రం నానితోనే అన్నది ఫిల్మ్‌నగర్ టాక్.
అయితే ‘కుబేర’ (Kubera movie) సినిమా తర్వాత ధనుష్‌తోనే మరోసారి సినిమా చేయాలని శేఖర్‌కమ్ముల భావించారట. మరి.. కానీ ధనుష్‌కు ఇప్పటికే చేతినిండా సినిమాలు ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ నానికి షిప్ట్ అయ్యిందని టాక్. నానీకి కూడా చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే..శేఖర్ కమ్ముల చాలా స్లోగా స్టోరీ రాస్తారు. పాతిక సంవత్సరాల్లో ఆయన పది సినిమాలే డైరెక్ట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన దర్శకత్వ శైలి ఎలా ఉంటుందో. దీంతో నాని తన ప్రస్తుత కమిట్ మెంట్స్‌ని పూర్తి చేసుకున్న తర్వాత శేఖర్ కమ్ములతో మూవీ ఉండనున్నట్లుగా తెలుస్తోంది.