దర్శకుడు రాజమౌళి (Director SSRajamouli) ఓ స్పెషల్ మేకింగ్ స్టైల్ ఉంది. తన సినిమాలో యాక్ట్ చేసే ఏ హీరో అయినా సరే… ..తన సినిమాకు సమాంతరంగా మరో సినిమా చేయకూడదు. మూవీ సమాచారం గురించి ఎక్కువగా షేర్ చేయకూడదు. యాడ్స్‌లో పార్టిస్పెట్ చేయకూడదు…ఇలా కొన్ని కండీషన్స్ ఉంటాయట. కానీ రీసెంట్ టైమ్స్‌లో రాజమౌళి రూల్స్ ఏవీ పనిచేయడం లేన్నట్లుగా కనిపిస్తోంది.
ప్రస్తుతం మహేశ్‌బాబు (MaheshBabu) హీరోగా రాజమౌళి ఓ మూవీ (SSMB29) చేస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్‌బాబు లుక్ ఏ మాత్రం రివీల్ కాకూడదని, రాజమౌళి ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు. మూవీ ప్రాథమిక ఓపెనింగ్ సమయంలో మహేశ్‌బాబు ఫోటోలు కూడా బయటకు రాలేదు. మహేశ్ ఫ్యాన్స్ చాలా నిరాశ పడ్డారు.కానీ ఇప్పుడు మహేశ్‌బాబు లుక్ సోషల్‌మీడియా మాధ్యమాల వేదికగా బయటకు వచ్చేసింది. పైగా మహేశ్‌బాబు తన కుమార్తె సితారతో కలిసి ఓ యాడ్ కూడా చేసేశారు.
మరోవైపు ఈ సినిమా సెట్స్‌లోకి రాబోతున్న ప్రతిసారి తన రాకపోకల నుంచి ప్రియాంకా చోప్రా తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వివరాలు చెబుతూనే ఉన్నారు. ‘లూసీఫర్ 2’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా..మహేశ్‌బాబు మూవీతో తాను ఏడాదిగా ట్రావెల్ అవుతున్న విషయాన్ని పృథ్వీరాజ్‌సుకుమారన్ కన్ఫార్మ్ చేశారు. ఇలా రాజమౌళి రూల్స్ ఒక్కొక్కటిగా బ్రేక్ అవుతూనే ఉన్నాయి.
ఇక రాజమౌళి సినిమాను తొలుత బ్రేక్ చేసింది రామ్‌చరణ్ అనే చెప్పవచ్చు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) మూవీ చిత్రీకరణ సమయంలో చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలోని ఓ గెస్ట్ రోల్ చేసేందుకు రామ్ చరణ్ కు పర్మిషన్ ఇచ్చారు రాజమౌళి. ‘ఆచార్య’ ఫలితం ఎలా ఉన్నా…రాజమౌళి రూల్‌ని తొలిసారి బ్రేక్ చేసిందిమాత్రం రామ్‌చరణ్‌యే. అది కూడా చిరంజీవి రిక్వెస్ట్ వల్ల కావొచ్చు.