Director Vishal: విశాల్ దర్శకత్వం వహించనున్న తొలి సినిమా ఖరారైంది. తన కెరీర్‌లోని 35వ సినిమా ‘మకుటం’తో విశాల్ దర్శకుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. ప్రముఖ నిర్మాణసంస్థ సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌లో 99వ సినిమా ఇది. తొలుత విశాల్ హీరోగా రవి అరసు డైరెక్షన్‌లో ‘మకుటం’ (Makuram Movie) సినిమా చిత్రీకరణ ఆరంభమైంది. కానీ విశాల్- రవి అరసుల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో, ‘మకుటం’ సినిమాకు విశాల్‌యే (Director Vishal) దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది.
ఈ దీపావళి పండక్కి, ‘మకుటం’ సినిమా సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగానే మకుటం సినిమాతో తన దర్శకత్వ ప్రయాణం మొదలు కాబోతున్నట్లుగా విశాల్ చెప్పాడు. ఆదరిస్తున్న ప్రేక్షకుల, డబ్బు ఖర్చు పెడుతున్న నిర్మాతల గురించి ఆలోచించి తాను దర్శకుడిగా మారానని, ఇందులో ఏం బలవంతం లేదని విశాల్ చెప్పారు. ఇక ఏ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం లేదని, ఈ దీపావళి సందర్బంగా తన దర్శకత్వ ప్రయాణం మొదలైనందని చెప్పడానికి సంతోషంగా ఉందని విశాల్ పేర్కొన్నాడు.
ఇక గతంలో ‘డిటెక్టివ్ 2’ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లుగా విశాల్ చెప్పారు. యూఎస్‌లో లోకేషన్ సెర్చ్ కూడా చేశారు. కానీ ఈ సినిమాకు తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రస్తుతం విశాల్ చెబుతున్న ప్రకారం ఆయన డైరెక్టర్‌గా తొలి సినిమా ‘మకుటుం’ అవుతుందని తెలుస్తోంది.
ఇక సముద్రపు మాఫియా నేపథ్యంతో సాగే ముకుటం సినిమాలో విశాల్ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అంజలి, దుషారా విజయన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తంజి రామయ్య, ఆర్జై ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.