రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసుదన్ ప్రధాన పాత్రధారులుగా, నట్టి నటరాజ్,వై.జి.మహేంద్రన్, నాడోడిగల్ భరణి, శరవణ సుబ్బయ్య, వేల్ రామమూర్తి, సిరాజ్ జానీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ద్రౌపతి -2’ (Draupathi 2). మోహన్.జి డైరెక్షన్‌లో నేతాజీ ప్రొడక్షన్స్ తరపున చోళ చక్రవర్తి, జి.ఎం.ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోంది.
ఈ ‘ద్రౌపతి -2’ చిత్రం 14వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుంది.ఆ సమయంలోనే మొఘల్ చక్రవర్తులు తమిళనాడులోకి ప్రవేశించారు. రక్తం తో రాసిన చరిత్రాక ఘటనల ఆధారంగా సినిమా రూపొందుతోంది. దక్షిణ భారతదేశానికి చెందిన హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంధమంగలాన్ని పాలించిన కడవరాయుల రాజులు, వీరత్వం, త్యాగం వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగు తుంది. ఈ సినిమా మేజర్ షూటింగ్ అంటే 75 శాతం ముంబైలో చేస్తున్నారు. మిగతా భాగం షూటింగ్ సెంజి, తిరువణ్ణామలై, కేరళలలో చిత్రీ కరించనున్నారు. ఈ చారిత్రక కథనం 2020లో విడుదలైన ద్రౌపతి సినిమా కథతో ఎలా అనుసంధానమవుతుందో అనే విషయం ప్రధానాంశంగా నిలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.