కాంత రివ్యూ…హంతకుడు ఎవరు?

Viswa

Web Stories

సినిమా: కాంత (Kaantha Review)
ప్రధానతారాగణం: దుల్కర్‌సల్మాన్, సముద్ర ఖని, భాగ్యశ్రీభోర్సే, రానా
దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్‌
నిర్మాతలు: రానా, దుల్కర్‌సల్మాన్, ప్రశాంత్‌ పోట్లూరి, జోమ్‌ వర్గీస్‌
సంగీతం:ఝును చందర్‌
ఎడిటర్‌: లెవెల్లిన్‌ ఆంథోనీ గోన్సాల్వేస్‌
నిడివి: 2 గంటల 43 నిమిషాలు
విడుదల తేదీ: నవంబరు 14, 2025

కథ (Kaantha Review)

అయ్య (సముద్రఖని) ఫేమస్‌ సినిమా డైరెక్టర్‌. అనాథ అయిన టీకే మహాదేవన్‌( దుల్కర్ సల్మాన్)ను యాక్టర్‌గా చేస్తాడు. మహా దేవన్‌ స్టార్‌ హీరో అవుతాడు. తన శిష్యుడు మహాదేవన్‌ హీరోగా తన తల్లి శాంత జీవితం ఆధా రంగా ఓ సినిమా ప్లాన్‌ చేస్తాడు అయ్య. కానీ అయ్యకు, మహాదేవన్‌కు మధ్య ఈగో క్లాసెష్‌ వచ్చి, సినిమా ఆగిపోతుంది. కొన్నికారణాల వల్ల ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ సినిమాను తిరిగి ప్రారంభిస్తారు. కానీ హీరో మహాదేవన్‌ ‘శాంత’ క్లైమాక్స్, టైటిల్‌ను ‘కాంత’గా మార్చి తేనే, సినిమా చేస్తానని కండీషన్‌ పెడతాను. తన అమ్మ కథను స్క్రీన్‌పై చూసుకోవాలన్న ఒకే ఒక కారణంతో హీరో కండీషన్‌కు ఒప్పుకుంటాడు అయ్య. ‘కాంత’ సినిమా తుది దశకు చేరు కున్న క్రమంలో, ఈ చిత్రం హీరోయిన్‌ కుమారి (భాగ్య శ్రీ బోర్స్) హత్యకు గురి అవుతుంది. మరి…ఈ హత్య చేసింది ఎవరు? పోలీస్‌ఆఫీసర్‌ ఫీనిక్స్‌ (రానా) నిజమైన హంతకుడిని ఎలా కనిపెట్టాడు? అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ

1950 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్‌ మూవీ ఇది. తమిళ స్టార్‌ హీరో ఎమ్‌కే త్యాగరాజ భాగవతార్‌ జీవితంలోని కొన్ని సంఘటలను బేస్‌ చేసుకుని, ఈ సినిమా తీశారనే టాక్‌ మొద ట్నుంచి వినిపిస్తుంది. యూనిట్‌ కాదని చెబుతూనే ఉన్నా, సినిమా చూసిన వారికి, ఎమ్‌కే త్యాగరాజ భాగవతార్‌ జీవితంలోని సంఘటనలెమో అనిపిస్తుంది.

Dulquer Salman And BaagyaSreeBorse in Kaantha Movie

కథ సినిమాలో సినిమా అన్నట్లుగా, మహానటి తరహాలో ఉంటుంది. తొలిభాగం దుల్కర్‌ సల్మాన్‌ – సముద్రఖనిల పాత్రల చిత్రీకరణ, పరిచయం, వీరిద్దరి మధ్య ఈగో క్లాసెష్, హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్, ఇంట్రవెల్‌ సమయానికి హీరోయిన్‌ కుమారి హత్యతో ఇంట్రవెల్‌ కార్డు పడు తుంది. హత్య కేసు ఇన్వెస్టిగేషన్‌ కోసం రానా ఎంట్రీ, క్లైమాక్స్‌లో ట్విస్ట్‌తో సినిమా ముగుస్తుంది.

1950 కాలం నాటి సినిమాటిక్‌ సన్నివేశాలను దర్శకుడు చక్కగా చూపించాడు. ఈ సీన్స్‌ని బాగానే రాసుకున్నప్పటికీని, క్రైమ్‌ డ్రామా కొత్తగా అనిపించదు. హత్య చేసింది ఎవరు? అనేది క్రైమ్‌ సస్పెన్స్‌ జానర్‌ సినిమాలు చూసే ఆడియన్స్‌ ఊహిస్తారు. కానీ హత్య చేసిన కారణాన్ని దర్శకుడు ప్రేక్షకుడికి కన్విన్సింగ్‌గా చెప్పే ప్రయత్నంలో కొంతమేర సఫలం అయ్యాడు.

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

యాక్టర్‌గా దుల్కర్‌సల్మాన్‌ (Dulqar Salman) మరోసారి మంచి నటన కనబరిచాడు.సముద్రఖని (Samuthirakani) తో ఉన్న పోటాపోటీ సన్నివేశాల్లో తన స్థాయి యాక్టింగ్‌కు ఏ మాత్రం తగ్గకుండ యాక్ట్‌ చేశాడు. రెండు కోణాలు ఉన్న అయ్య క్యారెక్టర్‌లో సముద్రఖని నటన సూపర్‌. హీరోతో సమానమైన క్యారెక్టర్‌ను సముద్రఖని ఈ సినిమాలో చేశాడు. ఇక ఈ సినిమాలో భాగ్య శ్రీ చేసిన కుమారి క్యారెక్టర్‌ రెగ్యులర్‌ హీరోయిన్‌ క్యారెక్టర్‌ కాదు. యాక్టింగ్‌కు మంచి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌. ఉన్నంతలో యాక్టర్‌గా మెప్పించింది భాగ్య శ్రీ (Kaantha heroine Bhagyashri Borse). దుల్కర్‌తో మంచి స్క్రీన్‌ ప్రజెన్స్‌ భాగ్యకు లభించింది. స్క్రీన్‌పై వీరి కెమిస్ట్రీ కూడా ఫర్వాలేదు

టెక్నికల్‌గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్‌. ముఖ్యంగా కెమెరామెన్‌ డాని శాంచెజ్‌ లోపేజ్‌ పని తనాన్ని మెచ్చుకోవచ్చు. విజువల్స్‌ బాగున్నాయి. జేక్స్‌ బిజోయ్‌ ఆర్‌ఆర్‌ ఈ సినిమాకు ఫ్లస్‌ అయ్యింది. దర్శకుడిగా తొలి సినిమా కాంతతోనే సెల్వమణి సెల్వరాజ్‌ (Kaantha movie director Selvamani selvaraj) ప్రేక్షకుల చేత పాస్‌ మార్కులు వేయించుకున్నాడు. స్టోరీ బ్యాక్‌డ్రాప్, స్క్రీన్‌ ప్లే, కథను ముందుకు నడిపించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ఫైనల్‌గా: పీరియాడికల్‌ క్రైమ్‌ డ్రామా ‘కాంత’. ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇస్తుంది. కథలోని మలుపులు, ట్విస్ట్‌లు ఎగై్జట్‌ చేస్తాయి. కానీ కాస్త ఓపిగ్గా చూడాలి.

కాంత రివ్యూ రేటింగ్‌ 2.75/ 5

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos