భావోద్వేగాలే బంధాలకు బలం అనే సున్నిత అంశంతో తెరకెక్కితున్న చిత్రం (Sathi Leelavathi). మెగా కోడలు లావణ్య త్రిపాఠి, మళయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్ సమర్పణలో దుర్గాదేవీ పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ ని మేకర్స్ విడుదల చేశారు. హీరో దేవ్ మోహన్‌ను బాత్రూమ్ బేషిన్‌కు కట్టేసినట్టు కనిపిస్తుంది. ఎదురుగా లావణ్య తిప్రాఠి మైక్ పట్టుకొని అరుస్తున్న పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ” నేటి కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీన పడుతోంది. మనుషులు మధ్య ఎమోషన్స్ లేకపోవడమే ఇందుకు కారణం. భావోద్వేగాలే బంధాలకు బలం. రెండు వేర్వేరు కుటుంబాలు, భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి ప్రయాణించాలంటే వారి మధ్య ఎమోషన్స్ ఇంకెంత బలంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భార్యభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గా కాకుండా, వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నమే సతీ లీలావతి. ఫీల్ గుడ్ మూవీగా అందరీ అకట్టుకుట్టునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించాలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము” అని అన్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్ ప్రకారం మేకర్స్ సినిమాను శరవేగంగా పూర్తి చేసి సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు.