రోహన్, రిదా జంటగా సూరి ఎస్ దర్శకత్వంలో హేమ్రాజ్ నిర్మిస్తున్న సినిమా ‘గప్ చుప్ గణేశా (GhupChupGanesha)’. అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టిలు ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ- ”గప్ చుప్ గణేశా’ ఫస్ట్‌లుక్ బాగుంది. ట్రైలర్ బాగుంది. ఇటువంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించాలి” అని అన్నారు. దామోదరప్రసాద్గారు మా సినిమా ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని చిత్రంయూనిట్ పేర్కొంది.
నేను మా ఊరు వెళ్లిపోతామామ…నాకున్న భయాలకు, మోహమాటాలకు ఇక్కడ సెట్ కానెమో అనిపిస్తోంది.
రేయ్ అన్నం తింటుడ్రా…గడ్డి తింటుడ్రా…ఎప్పుడు ఇస్తార్రా..పైసలు…..
నువ్వు జోకర్వా…ఇలా ఎవరైనా ఇంటర్వ్యూకూ వస్తారా…
ఈ రోజు కూడా స్పూన్ మర్చిపోయావా…
నువ్వంటే నాకు ఇష్టం లేదు..బ్రేకప్
నీ మ్యాటర్లో చాలా సెన్సిటివ్‌గా ఉన్నా…గణేష్ డోన్ట్ ప్లే విత్ మై ఎమోషన్స్
పై డైలాగ్స్ ఈ సినిమాలోని ట్రైలర్లో ఉన్నాయి.
అతి మోహమాటస్తుడైనా ఓ వ్యక్తి, అతని జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అన్నదే ప్రధాన కథాంశంగా ఈ చిత్రం రూపుదిద్దుకుటుంది. త్వరలోనే ఈ చిత్రం ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.