ప్లాప్ డైరెక్టర్ కి మరోసారి ఛాన్స్ ఇచ్చిన అజిత్..?

Kumar NA

Web Stories

Hero Ajith game chance to flop director : తమిళ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన కాంబినేషన్లలో ఒకటైన అజిత్ కుమార్ – శివ జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన నాలుగు చిత్రాలు ఒకదానిని మించి మరొకటి విజయం సాధించి, కోలీవుడ్‌లో ఈ జంటను ‘మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబో’గా నిలబెట్టాయి. అజిత్-శివ కలయికలో సినిమా వచ్చి దాదాపు ఏడేళ్లు అవుతోంది. ‘వీరమ్’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత వీరు మళ్ళీ ఎప్పుడు కలుస్తారా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, వీరి ఐదో చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు శివ ధృవీకరించడం విశేషం. దర్శకుడు శివకు ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. అజిత్‌తో చేసిన ‘విశ్వాసం’ తర్వాత ఆయనకు సరైన సక్సెస్ లభించలేదు. రజనీకాంత్‌తో తీసిన ‘అన్నాత్తె’, సూర్యతో రూపొందించిన పీరియాడిక్ డ్రామా ‘కంగువ’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ముఖ్యంగా ‘కంగువ’ ఫలితం శివ ఇమేజ్‌పై కొంత ప్రభావం చూపింది.

దీంతో అజిత్ సినిమాతో మళ్ళీ తన సత్తా చాటాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. అజిత్ కుమార్ తన వ్యక్తిగత ఆసక్తి అయిన కార్ రేసింగ్‌లో బిజీగా ఉండటం వల్ల సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. 2024లో ఆయన నుండి ఒక్క సినిమా కూడా రానప్పటికీ, ఆ తర్వాత ‘విదామయూర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలతో పలకరించారు. ప్రస్తుతం అజిత్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు పూర్తి కాగానే, శివ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నారు. వరుస పరాజయాల్లో ఉన్న దర్శకుడు శివ, గ్యాప్ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టిన అజిత్.. వీరిద్దరి కలయికలో రాబోయే ఈ ఐదో చిత్రం మళ్ళీ ‘విశ్వాసం’ రేంజ్ హిట్‌ను రిపీట్ చేస్తుందో లేదో వేచి చూడాలి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi Shivani Nagaram