అదెంటో…అల్లు అర్జున్‌తో (AlluArjun Movie updates) సినిమా అంటే ఇప్పుడు ఒకప్పట్లా అంత ఈజీ కాదు. పీఆర్ లెక్కలు, ప్రమోషన్ స్ట్రాటజీలు, బాక్సాఫీస్ నంబర్లు…ఇలా చాలా సమీకరణాలు ఉంటున్నాయి. బన్నీ ఏ దర్శకుడితో ఎప్పుడు ఎలా మూవ్ అవుతాడో తెలియని పరిస్థితి. లేటెస్ట్‌గా త్రివిక్రమ్‌కు షాక్ ఇచ్చాడు బన్నీ.
‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్‌తో అల్లు అర్జున్ ‘ఐకాన్’ అనే మూవీ చేయాల్సింది. ఈ సినిమాను ఆపేసి, త్రివిక్రమ్‌తో ‘అల. .వైకుంఠపురము లో…’ అనే మూవీ చేసి, హిట్ కొట్టాడు అల్లు అర్జున్. ‘అల..వైకుంఠపురములో..’ మూవీ తర్వాత దర్శకుడు కొరటాల శివతో సినిమా చేయాలి. కానీ కొరటాల శివ సినిమాను హోల్డ్‌లో పెట్టి, సుకుమార్‌తో ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ సినిమాలు చేసి, వరుస హిట్స్ కొట్టాడు అల్లు అర్జున్.
విడిపోయిన ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లను కలిపిన అల్లు అర్జున్
‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ తర్వాత త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాలి. కానీ త్రివిక్రమ్‌ను హోల్డ్‌లో పెట్టి, తమిళ దర్శకుడు అట్లీతో సినిమాను సెట్స్‌కు తీసుకునివెళ్లాడు అల్లు అర్జున్. అలాగే దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో కూడా అల్లు అర్జున్ హీరోగా ఓ మూవీ ఓపె నింగ్ జరిగింది. ఈ మూవీ కూడా హోల్డ్‌లో ఉంది. ఇలా ఇందరి దర్శకులను లైన్లో పెట్టిన అల్లు అర్జున్ ఇటీవల ‘దిల్’ రాజుతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైయ్యారన్న వార్తలొచ్చాయి.
ఇవి కాక..‘పుష్ప : ది ర్యాంపేజ్’ సినిమా ఉంది. మళ్లీ మొన్నా మధ్యలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతో సంప్రదింపులు జరిపాడు అల్లు అర్జున్. ఇంకా ఆమిర్‌ఖాన్ ‘మహా భారతం’ సినిమాలోనూ ఓ రోల్ అల్లు అర్జున్ చేయనున్నాడనే వార్తలు ఉన్నాయి. ఇలా అల్లు అర్జున్ తన లైనప్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ, స్ట్రాటజిక్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో కొందరు దర్శకులు ఇబ్బంది పడుతున్నారు. తాజా ఉదాహరణ దర్శకుడు త్రివిక్రమ్.