మూడు హిట్ సినిమాలను వదిలేసిన నాగచైతన్య

Viswa

తొలిప్రేమ, సార్, లక్కీ భాస్కర్…. సినిమాలు దర్శకుడు వెంకీ అట్లూరి కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు. తొలిప్రేమ సినిమాలో వరుణ్ తేజ్, సార్ సినిమాలో ధనుష్, లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ లు హీరో లుగా యాక్ట్ చేసి హిట్స్ అందుకున్నారు. కానీ ఈ మూడు సినిమాల కథ లను… తోలుత విన్న హీరో నాగచైతన్య. వివిధ కారణాల వల్ల నాగచైతన్య ఈ సినిమాలు చేయలేక పోయారు. ఇలా బెస్ట్ హిట్ మూవీస్ ని మిస్ చేసుకున్నారు.

తాను రాసిన ప్రతి కథ ను నాగచైతన్య కు వినిపించానని, కానీ వివిధ కారణాల వల్ల నాగచైతన్య తో సినిమామాలు కుదర్లేదని, ఓ ఇంటర్వ్యూ లో దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు. వెంకీ అట్లూరి ఇలా చెప్పగానే, నాగచైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక గా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య ఓ సూపర్ నేచురల్ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ లో యాక్ట్ చేస్తున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఈ సినిమాకు డైరెక్టర్.

మరో వైపు సూర్య తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ తో బిజీ గా ఉన్నాడు వెంకీ అట్లూరి. ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఇక తాను ముందుగా సూర్య కు సంజయ్ గాంధీ బయోపిక్ మూవీ చెప్పానని, కానీ ఇప్పటికే రెండు బయోపిక్ సినిమాలు చేసిన సూర్య, మరో బయోపిక్ చేయడానికి ఆసక్తి చూపలేదని, దీంతో ఫ్యామిలీ మూవీ స్క్రిప్ట్ ని రెడీ చేసానని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు. సూర్య చేస్తున్న ఈ 46వ సినిమాలో మమిత బైజు హీరోయిన్ గా చేస్తున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *