తమ్ముడు…మాట నిలబెట్టుకునే చాన్స్‌ వచ్చింది

Viswa
nithin Tammudu movie Trailer

నితిన్‌ (Hero Nithin) హీరోగా చేస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘తమ్ముడు’ (Thammudu Movie). ఈ సినిమాలో ‘కాంతార ’ఫేమ్‌ సప్తమి గౌడ హీరోయిన్‌గా చేస్తుండగా, లయ, వర్ష బొల్లమ్మ, చైల్డ్‌ ఆర్టిస్టు బేబీ దిత్య ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘వకీల్‌సాబ్, ఎమ్‌సీఏ’ సినిమాలు తీసిన వేణు శ్రీ రామ్‌ డైరెక్షన్‌లో ఈ తమ్ముడు సినిమా రాబోతుంది. ‘దిల్‌ ’ రాజు, శిరీష్‌లు నిర్మించారు. ఈ మూవీ జూలై 4న (Thammudu Movie Relea థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను (Nithin thammudu Trailer) రిలీజ్‌ చేశారు మేకర్స్‌. సెంటిమెంట్, భావోద్వేగాలు, యాక్షన్‌ అంశాలతో తమ్ముడు సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది.

‘‘మీ అక్కయ్యను చూసావా…తను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ…క్యారెక్టర్‌ను లూజ్‌ అవ్వడానికి రెడీగా లేదు.

చేసిన తప్పు వల్ల ఆవిడ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది…ఇప్పుడు ఆ మాట నిలబెట్టే చాన్స్‌ వచ్చింది…నిలబెడతా…..

ఏదీ ఏమైనా సరే..మొదట ఆ ఊర్నుంచి మీరు దూరంగా వెళ్లండి…

ప్రపంచానికి ప్రేమతో చెబితే అర్థం కాదు…అదే వయలెన్స్‌తో చెబితే…

మాట పోయి మనిషి బతికినా..మనిషి పోయినట్టే లెక్క…
అదే మాట బతికి మనిషి పోతే…మనిషి బతికి ఉన్నట్టే లెక్క…’’ అన్న డైలాగ్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి…ఈ సినిమాకు ఆడియన్స్‌ ఎలాంటి రిజల్ట్‌ ఇస్తారో చూడాలి.

చాలా కాలం తర్వాత లయ (Tammudu movie heroine Laya) ఈ సినిమాతో మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చారు. ‘కాంతార’ ఫేమ్‌ సప్తమిగౌడకు తెలుగుతో ఇదే తొలి చిత్రం. దాదాపు మూడేళ్ల తర్వాత వేణు శ్రీరామ్‌ నుంచి మూవీ ‘తమ్ముడు’. మరి..ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *