OG Movie Review: పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ సినిమాపై మొదట్నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్‌కల్యాణ్ గత చిత్రం ‘హరిహరవీరమల్లు’ బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయిన ప్పటికీని, ఈ నెగటివ్ ఇంపాక్ట్ ‘ఓజీ’పై పడలేదని, ‘ఓజీ’ (OG Movie) సినిమా ప్రీ సేల్స్ స్పష్టం చేశాయి. ప్రీమియర్స్‌తో కలిపి, ఇప్పటివరకు ఈ సినిమా ప్రీ సేల్స్ దాదాపు రూ. 100 కోట్లు వచ్చినట్లుగా సినీ ట్రేడ్ వర్గీయుల రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరి…ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’, ఆడియన్స్ అంచనాలను అందుకుందా? పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిందా? రివ్యూలో చదవండి.
సినిమా: ఓజీ (OG Movie Review)
ప్రధాన తారాగణం: పవన్‌కల్యాణ్, ఇమ్రాన్ హష్మి, అర్జున్‌దాస్, ప్రియాంకా మోహన్, ప్రకాష్‌రాజ్, శ్రియా రెడ్డి (OG Movie Cast and Crew)
దర్శకత్వం: సుజిత్ (OG Director)
నిర్మాణం: డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి
కెమెరా: రవి. కె చంద్రన్
సంగీతం: తమన్
ఎడిటింగ్:
నిడివి: 2 గంటల 34 నిమిషాలు
విడుదల తేదీ: సెప్టెంబరు 25, 2026 (OG Release date)
సెన్సార్: ‘ఏ’ సర్టిఫికేట్
రేటింగ్:2.5/5
కథ
ముంబై పోర్ట్‌ని శాసిస్తుంటాడు సత్యనారాయణ ఆలియాస్ సత్యదాదా. ఈ సత్యదాదాకి రక్షణ గా ఉండే రైట్ హ్యాండ్‌లాంటివాడు ఓజీ అలియాస్ ఓజాస్ గంభీర (పవన్ కల్యాణ్). కానీ కొన్ని కారణాల వల్ల సత్యదాదాకి దూరం అవు తాడు. మరోవైపు ఈ పోర్టును ఎలాగైనా దక్కించుకోవాలని సత్యదాదా ప్రత్యర్థులు కుట్రలు చేస్తుంటారు. ఈ క్రమంలో పోర్టులోని ఓ ఆర్‌డీఎక్స్ కంటైనర్ కోసం జిమ్మి (సుదేవ్ నాయర్).. సత్యదాదా కొడుకు(వెంకట్)ను చంపేస్తాడు. ఈ తర్వాత జమ్మి అన్న ఓజీ బావు ఆలియాస్ ఓంకార్ వర్థమాన్ ఈ ఆర్‌డీఎక్స్ కంటైనర్ కోసం సత్యదాదా, అతని మనుషులను భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు. దీంతో ఎక్కడో ఫ్యామిలీతో ప్రశాంతంగా జీవిస్తున్న ఓజీని కలవాలను కుంటాడు సత్యదాదా. మరి…పరిస్థితులు తెలిసిన తర్వాత ఓజీ ముంబై వచ్చి, సత్యదాదాను కాపడతాడా? సత్యదాదా మనవడు అర్జున్ (అర్జున్ దాస్) ఎందుకు ఓజీని చంపాలను కుంటాడు. కణ్మని (ప్రియాంక మోహన్)–ఓజీల ప్రేమకథ ఎలా మొదలైంది? అసలు..సత్యదాదాకి ఓజీకి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? ఓజీ జీవితంలో గీత (శ్రియారెడ్డి) పాత్ర ఏమిటి? అనేది వెండితెరపై చూడాలి (og Movie review)
విశ్లేషణ
ఓ పెద్ద మాఫియా లీడర్. అతని ముందు ఓ సైన్యంలా ఉండే ఓ పవర్‌ఫుల్ సైనికుడు. వీరిద్దరి మధ్య దూరం. లీడర్‌కు కష్టాలు. ఆ తర్వాత సైనికుడు మళ్లీ రంగంలోకి దిగి, లీడర్‌ను కాపా డటం. కాలానుగుణంగా సినిమాల్లో చాలా మార్పులు వచ్చాయి కానీ ఈ తరహా కథలు తెలుగు తెరపై కొకొల్లలు. కథ రోటీన్‌గా ఉన్నప్పుడు ట్రీట్‌మెంట్ అయినా కొత్తగా ఉండాలి. ఈ కొత్త తరహా ట్రీట్‌మెంట్ ‘ఓజీ’ సినిమాలో అయితే కనిపించదు. కథ చాలా ఫ్లాట్‌గా వెళ్తుంటుంది. ఊహాత్మాక సన్నివేశాలు, ఊహించదగ్గ క్లైమాక్స్..ఇవన్నీ ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ అనే చెప్పుకోవాలి. వీటికి తోడు కథలో ఎక్కువ పాత్రలు ఉండటం, ఈ పాత్రల వెనక ఉండే బ్యాక్ స్టోరీస్, సబ్‌ప్లాట్స్ కూడా పెద్దగా ఆసక్తికరమైనవి అయితే కాదు. పైగా ఓజీ–కణ్మనీల పాత్రల మధ్య ఉండే లవ్‌ట్రాక్ ఈ సినిమాకు ఏ మాత్రం ఉపయోగం లేనిది. ఇలాంటి గ్యాంగ్‌స్టర్ సిని మాల్లో హీరోయిన్ పాత్రను కట్ చేస్తుంటారు. ఓజీ సినిమాలోనూ ఇదే జరిగింది. దాదాపు ఈ సినిమా మూడునాలుగేళ్ల క్రితం మొదలైంది. సో…పవన్‌కల్యాణ్ లుక్స్‌లోనూ డిఫరెంట్ వేరియేషన్స్ కనిపించాయి.
పవన్‌కల్యాణ్ కోసం దర్శకుడు సుజిత్ (OG Director Sujith) మంచి ఫ్యాన్‌బాయ్ మూమెంట్స్‌ని అయితే సినిమాలో చూపించాడు. పవన్ ఇంట్రోసీన్, ఇంట్రెవల్ సీన్, ఓజీగా పవన్‌కల్యాణ్ ముంబైకి వచ్చిన తర్వాత కొన్ని సన్నివేవాలు, పోలీస్‌స్టేషన్ సీన్…ఇలా పవన్‌కు ఎక్కడ పడితే, అక్కడ ఎలివేషన్ సీన్స్ ఇచ్చిపడేశాడు. సుమురాయ్–యాకుజాల జపాన్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటంది. ఇవన్నీ పవన్‌ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేవే. మాస్ ఆడియన్స్‌ను అలరించే సన్నివేశాలే. యాక్షన్ బ్లాక్స్‌ను సుజిత్‌బాగానే రాసుకున్నాడు. కథలో ఆసక్తికరమైన డ్రామా లేదు. ఇంకా సాధారణ ప్రేక్షకుడికి కాస్త కన్‌ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఎమోషన్స్‌పై దృష్టిపెట్టి ఉండాల్సింది.
నటీనటులు-సాంకేతిక వర్గం పనితీరు
ఓజాజ్ గంభీర…ఓజీగా పవన్‌కల్యాణ్ (Pawankalyan) వెండితెరపై స్టైలిష్‌గా, ఆయన అభిమానులు కోరుకున్న స్వాగ్‌తో కనిపించాడు. వింటేజ్ యాక్షన్ పవన్‌కల్యాణ్‌ను చూస్తున్నామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక ఈ సినిమాలోని మరో ప్రధాన పాత్ర సత్యదాదాను ప్రకాష్‌రాజ్ పోషిం చారు. ఈ తరహా సినిమాల్లో ప్రకాష్‌రాజ్ ఎన్నో పాత్రలు చేసేశారు. అలాగే ఈ సత్యదాదా పాత్రనూ సక్సెస్‌ఫుల్ ఫుల్ ఆఫ్ చేశారు. కణ్మని పాత్రలో ఉన్నంతసేపు మెప్పించే ప్రయత్నం చేశారు ప్రియాంక. కానీ ఈ పాత్ర ఎండింగ్ అందరు ఊహించినట్లుగానే ఉంటుంది. సత్యదాదా మనవుడు అర్జున్‌గా అర్జున్ దాస్ ఓ కీలక పాత్ర చేశాడు. ఈ రోల్‌కు ఉన్న ట్విస్ట్ ఒకే. గీతగా శ్రియా రెడ్డి ఓ పవర్‌ఫుల్ రోల్ చేశారు. ఓమిగా ఇమ్రాన్ హష్మి నటన, స్టైల్ వెండితెరపై బాగున్నాయి. టాలీవుడ్‌లో విలన్‌గా ఇమ్రాన్‌కు మంచి డెబ్యూ దొరికినట్లయింది. సురేష్ నాయర్, హరీష్ ఉత్తమన్, రాహుల్ రవీంద్రన్, అభిమన్యు సింగ్, సౌరభ్ లోకేష్, శుభలేక సుధాకర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించి, మెప్పించే ప్రయత్నం చేశారు. సుహాస్, శుభశ్రీ, వెంకట్‌లు స్క్రీన్‌పై కనిపిస్తారు. ఇక మిగిలినవారు వారి వారి పాత్రల పరిధి మేరకు ఒకే అనేలా చేశారు.
టెక్నికల్ ఓజీ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ముఖ్యంగా తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా పెద్ద ఎస్సెట్. పవన్ ఎలివేషన్ సీన్స్‌లో తమన్ మార్క్ మ్యూజిక్ మ్యాజిక్ బాగానే వర్కౌట్ అయ్యింది. రవి కే చంద్రన్ విజువల్స్ సూపర్‌గా ఉన్నారు. డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్‌ల నిర్మాణ విలువలు పవన్ స్థాయికి తగ్గట్లుగా రిచ్‌గా వెండితెరపై కనిపిస్తాయి. ఎడిటింగ్, ప్రొడక్ష న్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైనింగ్…వంటి వారి పని తీరు బాగుంది.