ప్రభాస్ (Hero Prabhas) కెరీర్‌లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేసింది తక్కువ. ‘బిల్లా, సాహో’ చిత్రాల్లో ప్రభాస్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపిస్తాడు. మళ్లీ అలాంటి మూవీ చేసేందుకే ప్రభాస్ (Hero Prabhas) రెడీ అవుతున్నాడు. ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ మూవీ చేయ నున్నారు. ఈ సినిమాకు ‘బ్రహ్మారాక్షస’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఫిబ్రవరి 26 ప్రభాస్ ఇంట్లో, ‘బ్రహ్మారాక్షస’ సినిమాకు సంబంధించిన లుక్‌టెస్ట్ జరిగిందని తెలిసింది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లుగా తెలిసింది.
ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్, ఫౌజి’ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తయిన తర్వాత, ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొంటాడు. అయితే ‘బ్రహ్మారాక్షస’ (BramhaRakshasa) సిని మాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అంతేకాదు…ఈ సిని మాలోని ప్రభాస్ క్యారెక్టర్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. కానీ మేజర్‌గా నెగటివ్ షేడ్స్ ఉన్న ప్రభాస్ క్యారెక్టర్‌తోనే సినిమా సాగుతుంది.
బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్‌సింగ్‌తో ప్రశాంత్‌వర్మ తొలుత ‘బ్రహ్మారాక్షస’ సినిమాను స్టార్ట్ చేశాడు. మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మించా ల్సిం ది. కొంత ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరిగాయి. దాదాపు రూ. 10 కోట్ల రూపాయలకుపైనే ఖర్చు పెట్టారు. కానీ లాస్ట్ మినిట్‌లో ఈ మైథలాజికల్ మూవీ నుంచి రణ్‌వీర్ సింగ్ తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ కథతోనే ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడట ప్రశాంత్‌వర్మ. ఈ విషయంపై సరైన స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రభాస్–ప్రశాంత్‌వర్మ కాంబో మూవీని మాత్రం హోంబలే ఫిలింస్ సంస్థ (సలార్,కేజీఎఫ్ సినిమాలను నిర్మించిన సంస్థ) నిర్మించ నున్నట్లుగా తెలిసింది.
‘బ్రహ్మారాక్షస’ తర్వాత ‘సలార్ 2’ చేస్తారు ప్రభాస్. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్‌తో మూవీని సెట్స్‌కు తీసు కెళ్తాడు ప్రభాస్. అలాగే ఈ లోపు ‘రాజాసాబ్ 2’ మూవీ కూడ రిలీజ్ కావొచ్చు.