Andhra King Taluka First Review: రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఈ సెమీ పీరియాడికల్ డ్రామా చిత్రం ఈ నెల 27న..అంటే నవంబరు 27న ( Andhra King Taluka Release date) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. కొంత గ్యాప్ రామ్ తన స్ట్రెంత్ అయిన ఎనర్జిటిక్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అసలు..ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అనే విషయాలపై, ఇప్పటికే విడుదల అయిన టీజర్, ట్రైలర్‌లు కొంత స్పష్టత నిస్తున్నాయి.
ఆంధ్ర కింగ్ తాలూకా కాస్ట్ అండ్ క్రూ ( Andhra King Taluka Cast and Crew)
ఈ చిత్రంలో ఆంధ్రకింగ్ అనే పిలవబడే సూపర్‌స్టార్ హీరో సూర్యకుమార్ పాత్రలో ఉపేంద్ర ( Andhra King Taluka Upendra) నటించాడు. సూర్యకుమార్ అభిమాని సాగర్,సూర్యకుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా సాగర్‌గా పాత్రలో రామ్ నటించాడు. సాగర్ ప్రేయసి మహాలక్ష్మిగా భాగ్య శ్రీ బోర్సే (Andhra King Taluka heroine Bhagyashri Borse) నటించింది. సినిమాల్లో రామ్ తల్లిదండ్రులుగా రావు రమేష్, తులసీలు నటించారు. థియేటర్ యజమానిగా మురళీశర్మ, మరో కీలక పాత్రలో రాహుల్ యాక్ట్ చేశారు. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మించారు. తమిళ సంగీత ద్వయం వివేక్–మెర్విన్‌లు ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తు న్నారు. పి.మహేశ్‌బాబు ఈ సినిమాకు దర్శకుడు ( Andhra King Taluka Director P.MaheshBabu).
మెయిన్ కథ ఎలా ఉండబోతుంది?
సూర్య సినిమా రిలీజ్ రోజున సాగర్ చేసే హడావిడి, ఫస్ట్ డే ఫస్ట్ సో సెలబ్రేషన్స్, యాంటి ఫ్యాన్స్‌తో ఫైట్, మహాలక్ష్మితో సాగర్ లవ్ ట్రాక్..ఇలాంటి సీన్స్‌తో ఫస్ట్‌హాఫ్ అంతా సాగిపోతుందని ఊహించవచ్చు. అయితే సినిమాలోని మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ సూర్య–సాగర్‌ల మధ్య ఎలా క్రియేట్ అవుతుంది? అన్నదే ఈ సినిమా కోర్ పాయింట్ అని చెప్పవచ్చు. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోర్ పాయింట్‌కు మహాలక్ష్మీ క్యారెక్టర్ ఎలా కనెకై్ట ఉంటుందనేది కూడ ఇంపార్టెంట్ కావొచ్చని ఊహించవచ్చు. మహా లక్షి ఓ థియేటర్ ఓనర్ (మురళి శర్మ) కుమార్తె. తన కుమార్తెను, ఓ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కి ఇచ్చి వివాహం చేయడం అతనికి ఇష్టం లేదు. దీంతో… మహాలక్ష్మి కోసం సాగర్ తన ఫ్యూచర్ ను ఎలా మార్చుకున్నాడు? ఇందులో ఆంధ్ర కింగ్ సూర్య పాత్ర ఎంత అనేది? చూడాలి. ఈ కోణంలో ఈ సినిమా కథ సాగుతుందట.
అలాగే రామ్–ఉపేంద్ర కాంబినేషన్ సీన్స్ నిడివి ఎంత ఉంటుంది? అనేది కూడ ఈ సినిమాకు చాలా కీలకమనే చెప్పాలి. ఇంకా ప్రతి ఫ్యాన్ బయోపిక్‌గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు..సో ఓ హీరో అభిమానిగా హీరో తన ఫ్యామిలీని ఎలా చూసుకున్నాడు? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌లో ఎలా భాగమైయ్యాడు? అన్నది కూడా ఈ సినిమాలో ఓ కోర్ ఎమోషన్‌గా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది (Andhra King Taluka Movie First Review)
గతంలో ఆల్రెడీ కొన్ని సినిమాలు!
హీరో, హీరో అభిమాని..అంటూ గతంలో మలయాళంలో ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే మూవీ వచ్చిం ది. రజనీకాంత్, జగపతిబాబుల ‘కథానాయకుడు’ సినిమా కూడా ఉంది. హీరోయిన్ అభి మాని, హీరో అయ్యి…ఆ హీరోయిన్ పక్కనే యాక్ట్ చేసే సీన్స్ దర్శకుడు శంకర్– హీరో విక్ర మ్‌ల ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) సినిమాలో చూశాం. ఇలాంటి తరహా సినిమాల సీన్స్ రిపీట్ కాకుండ, ఈ చిత్రం దర్శకుడు పి.మహేశ్ బా బు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు? అన్నది కూడా కీలకమనే చెప్పాలి. మరి..‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా రామ్ కెరీర్‌కు హిట్ ఇస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
