నిర్మాత ‘దిల్’ రాజుతో రామ్‌చరణ్ చేసిన ‘గేమ్‌చేంజర్’ (GameChanger) మూవీ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ‘దిల్’ రాజు బ్యానర్‌లోని ఈ యాభైవ చిత్రం విఫలం కావడంతో ‘దిల్’రాజుకు కాస్త నష్టం వాటిల్లింది. దీంతో డ్యామేక్ కంట్రోల్‌లో భాగంగా ‘దిల్’రాజు (DilRaju)తో మరో సినిమా చేసేందుకు రామ్‌చరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని (Ramchran New Film), అతి తక్కువ పారితోషికంతో రామ్‌చరణ్ ఈ మూవీని ‘దిల్’ రాజుతో చేయాలనుకుంటున్నాడనే టాక్ తెరపైకి వచ్చింది. ఇలా ‘దిల్’ రాజుకు రామ్‌చరణ్ (Ramcharan) డేట్స్ వచ్చినట్లే!
కానీ ప్రస్తుతం బుచ్చిబాబుతో రామ్‌చరణ్ ‘పెద్ది (Peddhi)’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుంది. ఆ నెక్ట్స్ సుకుమార్ (Sukumar) చేస్తారు రామ్‌చరణ్. ఇలా..బుచ్చిబాబు, రామ్‌చరణ్‌లతో సినిమాలు పూర్తి చేసిన తర్వాత రామ్‌చరణ్‌తో ‘దిల్’ రాజు మూవీ ఉండొచ్చు. అయితే ఈ మూవీ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్(Ramchran New Film)లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
‘దిల్’రాజు దగ్గర ఇంద్రగంటి మోహనకృష్ణ రెడీ చేసిన ‘జటాయు’ (Jataayu) కథ ఉంది. అలాగే ప్రశాంత్‌నీల్ కమిటైన ‘రావణం’ కథ ఉంది. ఈ రెండు కథల్లో ఏదో ఒక కథని, రామ్‌చరణ్ చేయవచ్చు. ఎందుకంటే…ఈ సిని మాలకు కొంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. సో…ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లడం సులభంఅవుతుంది.
RifleClub Telugu Review: మలయాళం ఫిల్మ్ రైఫిల్ క్లబ్ రివ్యూ
ఇలా కుదరని పక్షంలో…‘దిల్’ రాజు ఫేవరెట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(AnilRavipudi)తో రామ్‌చరణ్ మూవీ ఉండొచ్చు. ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ తో మంచి హిట్ జోష్‌లో ఉన్నారు అనిల్‌రావిపూడి. ఆయన నెక్ట్స్ మూవీ కూడా చిరంజీవితో ఉంటుంది. ఈ సినిమా హిటై్టతే, చిరంజీవి కచ్చితంగా అనిల్‌రావిపూడిని కన్విన్స్ చేసి, రామ్‌చరణ్ మూవీకి ఒప్పించవచ్చు. ఈ మూవీని ‘దిల్’ రాజు నిర్మించవచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి.. రామ్‌చరణ్, దిల్ రాజు కాంబినేషన్‌లోని మూవీకి దర్శకుడు ఎవరు అవుతారో!(Ramchran New Film).