సమంతకు పోటీగా శ్రీవిష్ణు

Viswa
1 Min Read
Srivishnu #Single Movie Release date Locked

Web Stories

పవన్‌కళ్యాణ్‌ హరిహరవీరమల్లు సినిమా మే 9న రిలీజ్‌ ప్లాన్‌ చేశారు. కానీ ఈ మూవీ ఈ తేదీకి రిలీజ్‌ కాకపోవడం ఆల్మోస్ట్‌ కన్ఫార్మ్‌ అయిపోతుంది. దీంతో ఆ తేదీకి కొత్త సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ (Subham movie Release)  మే 9న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ హారర్‌ కామెడీ ఫిల్మ్‌కు ‘సినిమాబండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకుడు. సమంత ఓ గెస్ట్‌ రోల్‌ చేశారు.

మరోవైపు ఇదే రోజున శ్రీవిష్ణు కొత్త మూవీ ‘సింగిల్‌’ రిలీజ్‌ (#Single Movie Release) కు రెడీ అవుతోంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా యాక్ట్‌ చేసిన మూవీకి కార్తీక్‌ రాజు దర్శకుడు. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ గా ‘సింగిల్‌’ మూవీ రాబోతుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి ఈ సినిమాకు నిర్మాతలు. శ్రీవిష్ణు హిట్‌ ఫిల్మ్‌ ‘సామజవరగమన’కు వర్క్‌ చేసిన భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ సినిమాకు డైలాగ్స్‌ అందిస్తున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

శ్రీ విష్ణు గత చిత్రం ‘స్వాగ్‌’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్‌ అయ్యింది. దీంతో శ్రీ విష్ణు నుంచి రాబోతున్న ‘సింగిల్‌’ మూవీ హిట్, అతనికి చాలా కీలకం కానుంది.

 

Please Share
Share This Article
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu