శోభిత ధూళిపాళ్ల నటించిన ‘చీకటిలో…’ సినిమా రివ్యూ

Viswa
4 Min Read

Web Stories

Cheekatilo Review: క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో చాలా సినిమాలొచ్చాయి. ఈ జానర్‌లోనే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలూ వచ్చాయి. తా జాగా శోభితా ధూళిపాళ్ల చేసిన ‘చీకటిలో..’ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌వీడియోలో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవు తోంది. మరి..ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి లుక్‌ వేయండి…

సినిమా: చీకటిలో… (Cheekatilo Review)
ప్రధాన తారాగణం: శోభితా ధూళిపాళ్ల, విశ్వదేవ్‌ రాచకొండ, చైతన్య విశాలక్ష్మీ, ఈషా చావ్లా, ఝాన్సీ, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్‌
దర్శకుడు: శరణ్‌ కొప్పిశెట్టి
నిర్మాణం: సురేష్‌ ప్రొడక్షన్స్‌
స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌: అమేజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ
స్ట్రీమింగ్‌ డేట్‌: జనవరి 23
సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: శ్రీచరణ్‌ పాకాల
రేటింగ్‌: 2.25/5 (Cheekatilo Review and Rating)

Cheekatilo story review: కథ

Cheekatilo Telugu review: నవ్వ టీవీలో ప్రసారమయ్యే క్రైమ్‌ షో ‘ఇదీ ఘోరం’ ప్రెజెంటర్‌ నెల్లూరి సంధ్య. ఈ షో విషయంలో ఈ చానెల్‌ హెడ్‌తో క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వచ్చి, ఈ టీవీలో ఉద్యోగం మానేస్తుంది సంధ్య. ట్రూ క్రైమ్‌ స్టోరీస్‌ను చెప్పాలని, ‘చీకటిలో..’ అనే పేరుతో ఓ ప్యాడ్‌కాస్ట్‌ను స్టార్ట్‌ చేస్తుంది. ఈ సమయంలో తన దగ్గర ఇంటర్న్‌గా పనిచేసే బాబీ (అదితి మ్యాకెల్‌), ఆమె బాయ్‌ఫ్రెండ్‌ దారుణంగా హత్య చేయబడతారు. దీంతో ఈ బాబీని హత్య చేసిన హంతకుడిని పట్టుకోవాలని సంధ్య నిర్ణయించుకుంటుంది. మరోవైపు పోలీస్‌ రాజీవ్‌ (చైతన్య) కూడ ఇన్వెస్టిగేషన్‌ చేస్తుంటాడు (Cheekatilo review).

బాబీని హత్య చేసిన వ్యక్తి ఓ సిరియల్‌ కిల్లర్‌ అని, బాబీని చంపిన ప్యాట్రన్‌లోనే గతంలో కూడా ఈ కిల్లర్‌ చాలామందిని చంపాడని సంధ్య అనుమానిస్తుంటుంది. అతని గురించి కూపీ లాగడానికి గోదావరి జిల్లాల కు వెళ్తుంది. అక్కడ ఈ సైకో కిల్లర్ చేసిన రేప్స్ గురించి కొంతమంది బాధితులతో మాట్లాడుతుంది. మరి..ఆ ఈ సైకో కిల్లర్‌ గురించి సంధ్య తెలుసుకున్న కొత్త విష యాలు ఏమిటి? సైకో కిల్లర్‌ను సంధ్య ఎలా పట్టుకోగలిగింది? ఈ క్రమంలో పోలీస్‌ ఆఫీసర్‌ ఆనందిత (ఇషాచావ్లా)తో సంధ్యకు వచ్చిన ఇబ్బందులు ఏమిటి? అసలు..ఈ సైకో కిల్లర్‌కి సంధ్య ఉన్న రిలేషన్‌ఏమిటి? అనేది ‘చీకటిలో..’సిరీస్‌లో చూడాలి.

విశ్లేషణ (Cheekatilo movie analysis)

లైగింక వేధింపుల అంశాన్ని మరో కోణంలో చూపిస్తూనే, సమాజంలో మహిళల భద్రత, రక్షణ..వంటి అం శాలను చర్చించాడు దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి. ఎంచుకున్న పాయింట్‌ బాగానే ఉంది. కానీ ఈ అంశాన్ని సరైన రితీలో ఎగ్జిక్యూషన్‌ చేయడంలో మాత్రం దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి పూర్తిస్థాయిలో సఫలం కాలేకపో
యాడు.

1999లో రాజచంద్రాపురంలో జరిగే ఓ రేప్‌ అండ్‌ మర్డర్‌ ఇన్సిడెంట్‌తో చీకటిలో సినిమా కథనం స్టార్ట్‌ అవుతుంది. ఓ పది నిమిషాల తర్వాత ప్రజెంట్‌ డేలోకి వచ్చేస్తుంది. ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా అని చెప్పేకంటే….ఇన్వెస్టిగేషన్‌ డ్రామాగా చెప్పవచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్‌ డ్రామా సరిగా సాగదు. రోటీన్‌ స్క్రీన్‌ ప్లే, రెగ్యులర్‌ సీన్స్‌తోనే సినిమా సాగుతుంది. పైగా సంధ్య–అమర్‌ల లవ్‌ అండ్‌ పెళ్లి ట్రాక్‌ స్పీడ్‌బ్రేకర్‌లా కనిపిస్తుంది (Cheekatilo thriller review).

Cheekatilo Web Film Review
Cheekatilo Web Film Review

సెకండాఫ్‌లో పద్మ అపూరంగా చూసుకునే ఓ బొమ్మ సంధ్య చేతికి ఎలా వచ్చింది? సంధ్య సైకో కిల్లర్‌కు చూపించిన ఫోటో, ఆమెకు ఎక్కడ దొరికింది? 2000 టైమ్‌లో వరుస మర్డర్స్‌ జరుగుతున్నప్పుడు పోలీ సులు ఈ సైకో కిల్లర్‌ను ఎందుకు పట్టుకోలేకపోయారు? అన్న అంశాల పట్ల సరైన స్పష్టత లేదు. సైకో కిల్లర్‌ మర్డర్‌ మోటివ్‌ ‘మల్లెపూలు, మువ్వలు’ అన్న కాన్సెప్ట్‌ కూడ సరిగ్గా లేదు. ద్వేషించే మనిషిని చంపేసిన తర్వాత కూడా, ఇంకా కోపం చల్లారలేదని, ఆ వ్యక్తి వరుస హత్యలు చేయడం అన్న లాజిక్‌ కన్విన్సింగ్‌గా లేదు. పాడ్‌కాస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ను సరిగ్గా చూపించలేదు. ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి (Cheekatilo cinema review).

అయితే సైకో కిల్లర్‌ ను దర్శకుడు రివిల్‌ చేసిన విధానం బాగుంది. రెగ్యులర్‌ క్రైమ్‌ డ్రామాలు చూసే వారు కాకుండ, సాధారణ ఆడియన్స్‌ కిల్లర్‌ను ముందుగానే ఊహించడం కాస్త కష్టమే. లైంగిక వేధింపులకు ఆడా–మగ అన్న తేడాల్లేవు, టీజన్‌లో ఉండే అమ్మాయిలపైనే కాదు, టీనేజ్‌లో ఉండే అబ్బాయిలపైనా లైగింక వేధింపులు ఉంటాయని దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ మెచ్చుకోదగ్గది.

నటీనటుల పెర్ఫార్మెన్స్‌ (Cheekatilo cast performance)

క్రైమ్‌ స్టోరీస్‌ పాడ్‌కాస్ట్‌ నిర్వహించే జర్నలిస్ట్‌ సంధ్య పాత్రలో శోభిత మంచి నటన చూపించారు. సీరియస్‌ రోల్స్‌లో బాగానే కనిపించారు శోభిత. ఇక సంధ్య ప్రియుడు అమర్‌గా విశ్వదేవ్‌ రాచకొండ కనిపించాడు. కథలో ఇంపార్టెన్స్‌ లేని రోల్‌ ఇది. హీరోయిన్‌ పాత్రకు జోడీ కావాలని పెట్టినట్లుగా ఉంటుంది. ఇంకా అమర్‌ తండ్రిగా వడ్లమాని శ్రీనివాస్‌ ఓ సర్‌ప్రైజింగ్‌ రోల్‌ చేశాడు. పద్మగా ఆమని, నవ్య టీవీ హెడ్‌గా రవి వర్మ, డీఐజీ రాజ ము ణిగా సురేష్, పోలీస్‌ ఆఫీసర్లు రాజీవ్‌గా చైతన్య, ఆనందితగా ఇషా చావ్లా, రాజకీయ నాయకుడు చిన బాబు గా రవీంద్ర విజయ్, సంధ్య తల్లిగా ఝాన్సీ వారి వారి పాత్రల మేరకు యాక్టింగ్‌ చేశారు. నిర్మాణ విలువలు సాధారణంగా ఉన్నాయి. కెమెరా వర్క్‌ ఒకే. ఎడిటింగ్‌ ఇంకాస్త చేయవచ్చు. శ్రీచరణ్‌ పాకాల మ్యూజిక్‌ పెద్దగా సౌండ్‌ చేయలేదు.
ఫైనల్‌గా..లైంగిక వేధింపుల నేపథ్యంతో సాగే క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ డ్రామా ‘చీకటిలో..’. కానీ ఈ ఇన్వెస్టిగేషన్‌ రెగ్యులర్‌గానే ఉంటుంది. అయితే సమాజంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల గురించి, ఆలో చించాల్సిన జాగ్రత్తలను గుర్తు చేస్తూ, దర్శకుడు శరణ్‌ చేసిన ఓ మోస్తారు ప్రయత్నంగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు.

Please Share
Share This Article
139 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu