స్వయంభూ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌…కానీ!

Viswa
2 Min Read

Web Stories

Swayambhu Release: నిఖిల్‌  (Nikhil) హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. స్వయంభూ (Swayambhu Release )సిని మాను ఫిబ్రవరి 13, 2026న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. భరత్‌ కృష్ణ మాచారి (Swayambhu Movie Director) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.దాదాపు 170 రోజులు షూటింగ్‌ జరిపి, రెండు సంవత్సరాల కష్టంతో ‘స్వయంభూ’ సినిమాను తెరకెక్కిం చామని నిఖిల్‌ చెబు తున్నారు. ఠాగూర్‌ మధు సమర్పణలో పీక్సెల్‌ స్టూడియోస్‌ పతాకంపై భువన్‌ అండ్‌ శ్రీకర్‌ ఈ సినిమాను నిర్మించారు. కేకే సెంథిల్‌కుమార్‌ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌. కేజీఎఫ్, సలార్‌ వంటి సినిమాలకు సంగీతం అందించిన రవిబస్రూర్‌ స్వరకర్త.

ఇక ‘స్వయంభూ’ సినిమాలో నభా నటేశ్, సంయుక్త హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంయుక్త క్యారెక్టర్‌కు యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలుస్తుంది. ఈ హిస్టారికల్‌ వార్‌ డ్రామా సినిమా ముఖ్యంగా ఓ రాజదండం నేపథ్యంతో సాగుతుందని తెలిసింది. నటుడు సునీల్‌ ఓ ముఖ్యమైన లీడ్‌ రోల్‌ చేశారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాను గురించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. నిజానికి స్వయంభూ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేద్దామనుకున్నారు. కానీ భారీగా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ పెండింగ్‌ ఉండటం వల్ల, స్వయంభూ సినిమాను వచ్చే ఫిబ్రవరి 13కు వాయిదా వేశారు.

ఫిబ్రవరి 13 అంటే..ప్రేమికుల దినోత్సవం సందర్భం. ఈ టైమ్‌కి ఎక్కువగా లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామా బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు థియేటర్స్‌కు వస్తుంటాయి. కానీ ‘స్వయంభూ’ ఓ హిస్టారికల్‌ డ్రామా. సో..ఈ సినిమాను ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుం టారన్న ఆసక్తి అయితే నెలకొని ఉంది. అయితే ఇదే సమయంలో మహాశివరాత్రి ఫెస్టివల్‌ కూడా. దీంతో ఈ ఫెస్టివల్‌ సీజన్‌ తమకు కలిసొస్తుందని నిఖిల్‌ అండ్‌ టీమ్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను భారతీయ భాషలతో పాటుగా, చైనీస్‌, స్పానిష్‌, అరబిక్‌ వంటి విదేశీ భాషల్లోనూ రిలీజ్‌ చేయనున్నట్లుగా యూనిట్‌ చెబుతోంది.

Please Share
Share This Article
15 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu