రామ్‌ చేతికి నాగచైతన్య సినిమా

Viswa
1 Min Read

Web Stories

నాగచైతన్య సినిమా రామ్‌కు (Hero Ram pothineni next film) షిష్ట్‌ అయ్యనట్లు తెలుస్తోంది. నాగచైతన్య ‘తండేల్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో, కిషోర్‌అనే ఓ కొత్త దర్శకుడు ఓ మిస్టిక్‌ థ్రిల్లర్‌ కథను చెప్పాడు. ఈ కథ నచ్చి, నాగచైతన్య గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. రానా స్పిరిడిట్‌ మీడియా, ఆర్కా మీడియా సంస్థలు ఈ సినిమాను నిర్మించాలనుకున్నాయి. అప్పట్నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ‘తండేల్‌’ సినిమా తర్వాత ‘విరూపాక్ష’ సినిమా దర్శకుడు కార్తీక్‌ వర్మ దండుతో నాగచైతన్య (Hero Ram pothineni next film) ముందుకు వెళ్తాడు. దీంతో కిషోర్‌ ప్రాజెక్ట్‌ హోల్డ్‌లో పడింది. కానీ నిర్మాతలు తక్కువ వారేం కాదు కదా. అందుకే ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోలేదు. కానీ కార్తీక్‌ వర్మతో నాగచైతన్య సినిమా కాన్సెప్ట్‌, కిషోర్‌ చెప్పిన కథ దగ్గరగా ఉండటంతో, కిషోర్‌ సినిమాను వద్దనుకున్నారట నాగచైతన్య.

అటు ఇటు కదిలి మెల్లిగా, ఈ ప్రాజెక్ట్‌ రామ్‌ చెంతకు చేరింది. రీసెంట్‌ టైమ్స్‌లో రామ్‌ ఆ తరహా కొత్త కథలను చేయలేదు. దీంతో రామ్‌ కూడా ఈ సినిమా కథకు ఒకే చెప్పాడు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ‘ఆంధ్రా కింగ్‌ తాలుకా’ సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్‌. పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో  కన్నడ స్టార్‌ ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తన్నాడు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల అయ్యే చాన్సెస్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయిన తర్వాతే కిషోర్‌తో రామ్‌ సినిమా పట్టాలెక్కే చాన్సెస్‌ ఉన్నాయి. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి కాబట్టి, ఈ సినిమాను మేకర్స్‌ లార్జ్‌ స్కేల్‌లోనే ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Please Share
Share This Article
109 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu