తొలిరోజే ఏడ్చేశా…సినిమాలు వద్దనుకున్నాను: హీరోయిన్‌ మీనాక్షీ చౌదరి

Viswa

Web Stories

Meenakshi Chaudhary Interview: గుంటూరుకారం, సంక్రాంతికి వస్తున్నాం, హిట్‌: ది సెకండ్‌ కేసు, లక్కీభాస్కర్‌….వంటి సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు హీరోయిన్‌ మీనాక్షీ చౌదరి. ఈ పాపులర్‌ బిజీ హీరోయిన్‌ లేటెస్ట్‌గా యాక్ట్‌ చేసిన సినిమా ‘అనగనగాఒకరాజు’ (AnaganagaOkaRajuMovie). ‘జాతిరత్నాలు’ ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించగా, మారి డైరెక్ట్‌ చేశాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ సంక్రాం తి సందర్భంగా జనవరి 14న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary Interview:) పంచుకున్నారు.

– అనగనగాఒకరాజు (#AnaganagaOkaRajuMovie Heroine Meenakshi)  సినిమాలో నేను చారులత అనే రోల్‌ చేశాను. చాలా ఇన్నోసెంట్‌ రోల్‌ ఇది. నా రియల్‌లైఫ్‌కి పూర్తి వ్యతిరేకమైన పాత్ర ఇది. మంచి కామెడీ రోల్‌ చేశాను. 2024లో గుంటూరుకారం, 2025లో సంక్రాంతికి వస్తున్నాం, 2026లో అనగనగా ఒకరాజు చిత్రం..ఇలా వరసగా మూడు సంక్రాంతు లకు నా సినిమాలు వస్తున్నాయి. ఇదీ నేను ప్లాన్‌ చేసింది కాదు. వచ్చే సంక్రాంతికి కూడా వెంకటేశ్‌గారితో మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వస్తే హ్యాపీనే.

– అవుట్‌ అఫ్‌ లవ్‌ టీవీ సిరీస్‌ యాక్టర్‌గా నా తొలి ప్రాజెక్ట్‌. ఈ సిరీస్‌ తొలి రోజు షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. తొలి రోజే సెట్స్‌లో ఏడ్చాను. సినిమాలు, యాక్టింగ్‌ వదిలేద్దామనుకున్నాను. నా మేనేజర్‌కి కాల్‌ చేసి, చెప్పాను. కానీ అతను కాంట్రాక్ట్‌ ఉందని చెప్పి, కన్విన్స్‌ చేశాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేశాను. మెల్లగా యాక్టింగ్‌పై అవగాహన పెంచుకున్నాను. ఆ తర్వాత ఒక్కో ప్రాజెక్ట్‌ చేసుకుంటూ, నటిగా ఇక్కడి వరకు వచ్చి, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.

అయినా ఇండస్ట్రీలో సెటిల్‌ అవ్వడం అంటూ ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్ళు వస్తూనే ఉంటారు. ప్రతి రోజు ఓ రేస్‌. ఇంతమంది ఇండస్ట్రీలో ఉన్నప్పటికీని మనకే అవకాశాలు వస్తున్నాయంటే, వాళ్ల సిని మాకు మనం ఉండటం వల్ల ఏదో ఉపయోగం ఉందని దర్శక–నిర్మాతలు భావిస్తేనే మనకు అవకాశాలు వస్తాయి. నా వరకు నేను వందశాతం కష్టపడతాను. క్రమశిక్షణగా ఉంటాను. హార్డ్‌వర్క్‌ చేస్తునే ఉంటాను.

-మన జీవితాల్లో మహిళలు చాలా కీలక పాత్ర వహిస్తారు. నా జీవితంలో మా అమ్మగారు, నా టీచర్స్‌ ఎంతో ప్రభావం చూపించారు. ఇక పోటీ అంటే ప్రతిచోట ఉంటుంది. స్కూల్‌లో, కాలేజీ, మిస్‌ ఇండియా కాంపీ టీషన్‌లో..మనం మనం మన జీవితాల్లో పోటీలను చూస్తూనే ఉంటాము. అలాంటి పోటీయే ఇండస్ట్రీ లో కూడా ఉంటుంది. మనలో వర్త్‌ ఉందని దర్శక–నిర్మాతలు భావించినంతకాలం మనకు అవకాశాలు వస్తూనే ఉంటాయి.

– సోషల్‌మీడియాలో ట్రోల్స్‌ చూసినప్పుడు నాకు బాధగా ఉంటుంది. ప్రస్తుతానికి నా పెళ్లి వార్త ఏదీ లేదు. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది సోషల్‌మీడియా అనేది ఆగిపోతే బాగుంటందని.

– సోషల్‌మీడియాలో టైమ్‌ స్పెండ్‌ చేయడం కంటే కూడా నేను జర్నల్స్‌ రాస్తుంటాను. మనకున్న అన్నీ సమ స్యలను మనం మన తోటివారితో పంచుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఎక్కడైనా వాటిని రాసు కున్నప్పుడు కాస్త రిలీఫ్‌గా అనిపిస్తుంది. మనం ఏదైనా రాస్తున్నామంటే..మన బ్రెయిన్‌లో ఉన్నదే రాస్తం. సో…మన కోసం మనం టైమ్‌ కేటాయించుకుంటున్నాం. ఇది చాలా మంచి విషయం. ఈ రోజుల్లో మాన సికంగా స్ట్రాంగ్‌గా ఉండటం కూడా చాలా ముఖ్యం.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos