vijay deverakonda and shouryuv film: హీరో విజయ్‌దేవరకొండ (vijay deverakonda ), ‘హాయ్ నాన్న’ సినిమా ఫేమ్ దర్శకుడు శౌర్యువ్ (shouryuv film) కాంబినేషన్‌లో సినిమా ఖరారైంది. మైథలాజిక్ యూనివర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది. భారీ క్యాన్వాస్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను వైరా నిర్మాణసంస్థ నిర్మించనుంది. శనివారం ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌పై ‘ఈ కోపమంతా ఒకప్పుడు ప్రేమ’ అని క్యాప్షన్ కూడా ఉంది.
ఇక సినిమా టెక్నికల్‌గా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్నట్లుగా తెలుస్తోంది. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్’ వంటి సినిమాలకు కెమెరామేన్‌గా వర్క్ చేసిన అలెజాండ్రో మార్టినెజ్ ఈ సినిమాకు వర్క్ చేయనున్నారు. ‘గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్’ వంటి చిత్రాలకు వీఎఫ్ ఎక్స్ సూపర్‌వైజర్‌గా వర్క్ చేసిన ఎరిక్ డస్ట్ర్ ఈ చిత్రానికి అసోసియేట్ అయ్యారు. ‘ఓం శాంతి ఓం, యూనిమల్’ వంటి హిందీ చిత్రాలకు పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ ఈ సినిమాకు వర్క్ చేస్తారు. హేషబ్ అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారుఈ ఏడాది చివర్లోనే, ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది.
My next is – #VDxShouryuv ❤️
Introducing the team taking on the scary task of making this intimidating film.
So happy to have this firecracker global team working on this one with Shouryuv and his wild imagination and intense heart 🙂
ROAR my friends. I will give you my all.… pic.twitter.com/l1QXpoOmk3
— Vijay Deverakonda (@TheDeverakonda) April 18, 2026
ప్రస్తుతం ‘రణబాలి, రౌడీ జనార్థన’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలోని ‘రణాబాలి’ సినిమా ఈ సెప్టెంబరు 11న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ‘రౌడీ జానర్థన’ సినిమాను ఈ డిసెంబరులో రిలీజ్‌కు ప్లాన్ చేశారు. కానీ ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒక చిత్రమే ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
crazy time play crazy time play