Vijay Deverakonda Ranabaali: విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘రణబాలి’ (Ranabaali movie) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వి జయ్‌దేవరకొండతో ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఫిల్మ్ తీసిన రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan director) ఈ సినిమాకు దర్శకుడు. అలాగే ‘రణబాలి’ సినిమా కోసం విజయ్‌దేవకొండ, రష్మికా మందన్నాలు ముచ్చటగా మూడోసారి ( VijayDevatakonda- Rashmika Mandanna New Movie Ranabaali) కలిసి నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు ‘డియర్ కామ్రేడ్, గీతగోవిందం’ సినిమాలకు కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.
ఇంకా ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ చిత్రాల్లో విజయ్‌దేవరకొండ హీరోగా నటించగా, ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించింది. తాజాగా ‘రణబాలి’ సినిమా నిర్మాణంలో మైత్రీమూవీమేకర్స్ సంస్థ అసోసియేట్ అయ్యింది. 77వ గణతంత్రదినోత్సవం సందర్భంగా రణబాలి సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లోని 14వ సినిమా ఇది.
1854–1878 మధ్యకాలంలో రాయలసీమ నేపథ్యంతో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రణబాలి కథనం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. బ్రిటిషర్ల క్రూరమైన పాలనలో భారతీయులు ఎలా ఇబ్బందులు పడ్డారు? భారతీయులకు రణబాలి ఎలా అండగా నిలబడ్డాడు? ( savage warrior) అన్న ప్రధానాంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది (Ranabaali first look)

ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండ టైటిల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తండ్రీకొడుకుల పాత్రల్లో విజయ్‌దేవరకొండ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ చిత్రంలోని హీరోయిన్ జయమ్మ పాత్రలో రష్మికా మంద న్నా, విలన్ సర్ థియోడర్ హెక్టార్‌పాత్రలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo) ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
అలాగే ఈ ‘రణబాలి’ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 11న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. టీసిరీస్ ఫిలింస్, గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్‌ల సమర్పణలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనురాగ్ పర్వతనేని, శివ్ చనన సహ–నిర్మాతలుగా వ్యవహిరస్తున్నారు. అజయ్–అతుల్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్స్ (vijay Devarakonda Ajay Atul music)
ఇంకా విజయ్‌దేవరకొండ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘రౌడీ జనార్థన’ డిసెంబరు 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా కంటే ముందుగా ‘రణబాలి’ విడుదలకు సిద్ధం అవుతుంది. ఇలా ఈ ఏడాది విజయ్ దేవరకొండ నుంచి రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి.