రాజమౌళి చెప్పారని చదువు పూర్తి చేశా!: దర్శకుడు మునిరాజు

Viswa
2 Min Read

Web Stories

Director MuniRaju: హీరో కిరణ్‌ అబ్బవరం నిర్మించిన తొలి సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ (Thimmarajupalli TV). ఈ సినిమాతో కిరణ్‌ అబ్బవరం ‘మీటర్‌’ సినిమాకు ఆన్‌లైన్‌ ఎడిటర్‌గా పనిచేసిన మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అలాగే కిరణ్‌ నటించిన మరో సినిమాకు కెమెరామేన్‌గా పనిచేసిన సాయితేజ్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. వేద జలందర్‌ హీరోయిన్‌. ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్‌ (Thimmarajupalli TV Release date) కానుంది. ఈ సమయంలో ఇండస్ట్రీలో తన ఫిల్మ్‌మేకింగ్‌ కెరీర్‌పై మునిరాజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

‘‘నేను ఇంటర్‌ చదువుకునే రోజులు అవి. ఇండస్ట్రీలో దర్శకుడిని కావాలన్నది నా కల. కాస్‌రూమ్‌లో కన్నా, థియేటర్స్‌లోనే ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేసేవాడిని. ఇంటర్‌లో బైపీసీ తీసుకున్నాను. ఆల్‌ సబ్జెక్ట్స్‌ ఫెయిల్‌ అయ్యాను. ‘మగధీర’ సినిమా చూసి, ఇండస్ట్రీకి రావాలని ఫిక్స్‌ అయ్యాను. దర్శకుడిగా రావాలనుకున్నాను. ఓ సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే యువతీయువకులు…చదువు పూర్తి చేసుకున్న తర్వాతే రావాలన్నట్లుగా రాజమౌళి చెప్పారు. ఈ మాటలు నాకు స్ఫూర్తిని ఇచ్చాయి. దీంతో నా గ్రాడ్యూయేషన్‌ను సక్సెస్‌పుల్‌గా పూర్తి చేశాను.

ఇక ఇండస్ట్రీలో మనుగడ కోసం ఆన్‌లైన్‌ ఎడిటర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేశా. కొంతకాలం ఆన్‌లైన్‌ ఎడిటర్‌గా చేశాను. ఈ క్రమంలో రామ్‌గోపాల్‌వర్మగారి ‘సత్య’ సినిమా చూశాను. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేయలేదు కానీ…‘సత్య’ సినిమా చూసి, ఎడిటింగ్, మ్యూజిక్, ఆర్‌ఆర్‌…వంటి అంశాలను నేర్చుకున్నాను. ఇప్పటికీ నాకు ఏదైనా డౌట్‌ వస్తే, సత్య మూవీ చూస్తాను. అంతలా ఆ సినిమా నన్ను ప్రభావితం చేసింది. ఇంకా వెట్రిమారన్‌ ఫిల్మ్‌మేకింగ్‌ అంటే చాలా ఇష్టం. మనం ఇప్పుడు ఏవో సినిమాలు చేశామని అంటున్నారు కానీ..‘మాభూమి, మాలపిల్ల’ వంటి ఎన్నో అద్భుతమైన క్లాసిక్‌ సినిమాలను మన గత ఫిల్మ్‌మేకర్స్‌ చేశారు. ఈ సినిమాలు మాలాంటి యంగ్‌ ఫిల్మ్‌మేకర్స్‌కు స్పూర్తినిస్తూనే ఉంటాయి.’’అని చెప్పారు.

Thimmarajupalli TV Movie Director V MuniRaju
Thimmarajupalli TV Movie Director V MuniRaju

ఇక తిమ్మరాజుపల్లి టీవీ సినిమా పక్కా పల్లెటూరి సినిమా అని, ఈ ఊరికి తొలిసారిగా టీవీ వచ్చినప్పుడు, ఆ టీవీ మిస్‌ అవుతుందని, ఆ టీవీ మిస్సింగ్‌ మిస్టరీ చూట్టే, ఈ సినిమా కథ సాగుతుందని వి.మునిరాజు చెప్పారు. ఈ సినిమా చూసిన తర్వాత, ఆడియన్స్‌ తమతో ఎమోషన్స్‌ను తీసుకుని వెళ్తారని మునిరాజు స్పష్టం చేశారు.

Please Share
Share This Article
89 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu