Sharwanand Bhogi: ‘రచ్చ, బెంగాల్ టైగర్, సిటీమార్’ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించు కున్నారు దర్శకుడు సంపత్‌నంది. కానీ 2021లో వచ్చిన ‘సీటీమార్’ తర్వాత సంపద్ నంది నుంచి మరో సినిమా రాలేదు. నిర్మాతగా మూడు సినిమాలొచ్చినా, దర్శకుడిగా అయితే రాలేదు.
సాయిధరమ్‌తేజ్‌తో ‘గాంజా శంకర్’ సినిమాను స్టార్ట్ చేశాడు సంపత్‌నంది. కానీ ఈ సినిమా ఆగిపోయింది. కొంత గ్యాప్ తర్వాత ‘భోగి’ అనే ఓ పరవ్‌ఫుల్ స్క్రిప్ట్‌ని రెడీ చేసి, శర్వానంద్‌తో సినిమాను స్టార్ట్ చేశారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంతో సాగే సినిమా ఇది. షూటింగ్ కోసం భారీ సెట్ కూడా వేశారు.
కానీ ఏమైందో ఎమో..కానీ ఈ సినిమా ప్రాజెక్ట్ నుంచి శర్వానంద్ తప్పుకున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ నిలిచిపోయిందట. ఇక శర్వానంద్ ప్లేస్‌లో గోపీచంద్‌ని తీసుకోవాలని, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారట సంపత్‌నంది.
గతంలో గోపీచంద్‌తో గౌతమ్‌నంద, సీటీమార్ వంటి సినిమాలను తీశాడు సంపత్‌నంది. అలాగే ‘భోగి’ సినిమా నిర్మాత కేకే రాధామోహన్‌తో కూడా గోపీచంద్‌కు మంచి అనుబంధమే ఉంది. గోపీచంద్ 25వ సినిమా పంతంతో పాటుగా, మరో రెండు సినిమాలను రాధామోహన్ నిర్మించాడు. ఇలా దర్శకుడు, నిర్మాతతో గోపీచంద్‌కు మంచి అసోయేషియేషన్ ఉన్న నేపథ్యంలో, ‘భోగి’ నుంచి శర్వానంద్ తప్పుకున్నట్లయితే, ఈ ప్లేస్‌లో గోపీచంద్ రావడం ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లే అనుకోవచ్చు. మరోవైపు ప్రజెంట్ సంకల్ప్ రెడ్డితో శూల అనే పీరి యాడికల్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు గోపీచంద్.