Suriya Vaadivaasal: ఆఫ్టర్‌ ఫోర్‌ ఇయర్స్‌…!

Suriya Vaadivaasal: సూర్య, వెట్రిమారన్‌ కాంబినేషన్‌లోని వాడివాసల్‌ మూవీ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Viswa
1 Min Read
Hero Surya Vadivaasal

Suriya Vaadivaasal: హీరో సూర్య, దర్శకుడు వెట్రిమారన్‌ కాంబినేషన్‌లో ‘వాడివాసల్‌’ (Suriya Vaadivaasal) అనే ఓ పీరియాడికల్‌ ఫిల్మ్‌ రానుంది. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ‘వాడివాసల్‌’ను అధికారికంగా ప్రకటించారు. కొంత టెస్ట్‌ షూట్‌ కూడా జరిపారు.

Sookshmadarshini ott: మలయాళ బ్లాక్‌బస్టర్‌ సూక్ష్మదర్శని రివ్యూ

అలాగే ఈ సినిమాకు చాలా గ్రాఫిక్స్‌ వర్క్‌ చేయాల్సి ఉందట. దీంతో ముందుగా కొంత టెక్నికల్‌ వర్క్‌ను కంప్లీట్‌ చేయాలని, లండన్‌లోని ఓ ప్రముఖ కంపెనీకి ఈ పనులు అప్పగించారు వెట్రి మారన్‌. ఈ లోపు వెట్రిమారన్‌ ‘విడుదలై’ (తెలుగులో విడుదల) ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. కానీ ఈ ప్రాజెక్ట్‌ సడన్‌గా రెండు భాగాలుగా చేయాల్సి వచ్చింది. మరోవైపు సూర్య కూడా ‘కంగువా’ మూవీతో చాలా బిజీ అయ్యారు అప్పట్లో. దీంతో ‘వాడివాసల్‌’ (Vaadivaasal) మూవీ షూటింగ్‌ ఆలస్యమౌతూనే ఉంది. అయితే ఈ ఏడాది ‘వాడివాసల్‌’ మూవీ సెంట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా చిత్రం నిర్మాత కలైపులి ఎస్‌. థాను స్పష్టం చేస్తున్నారు.

Ramcharan GameChanger Movie Review: రామ్‌చరణ్‌ గేమ్‌ఛేంజర్‌ మూవీ రివ్యూ

ఇక సూర్య హీరోగా కార్తీక్‌సుబ్బరాజు డైరెక్షన్‌లోని ‘రెట్రో’ (Retro) మూవీ మే 1న రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం ఆర్‌జే బాలాజీ డైరెక్షన్‌లో సూర్య హీరోగా ఓ మూవీ చేస్తున్నారు. త్రిష హీరోయిన్‌. ఈ మూవీ చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత సూర్య ‘వాడివాసల్‌’ మూవీ సెట్స్‌పైకి వెళ్తుందని ఊహిం చవచ్చు. ఈ లోపు ‘వాడివాసల్‌’ పనులతో బిజీగా ఉంటారు దర్శకుడు వెట్రిమారన్‌.

Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *