తేజసజ్జా మిరాయ్‌ ఫస్ట్‌ రివ్యూ

Viswa
Tejasajja mirai Movie First and PreReview

‘మిరాయ్‌’ (Tejasajja mirai) సినిమాను ‘హను–మాన్‌’ కంటే ముందే ఒప్పుకున్నాడు తేజ సజ్జా. కానీ ‘హను–మాన్‌’ చిత్రం ముందుగా విడుదల కావడం జరిగింది. అయితే దాదాపు రూ. 300 కోట్ల రూపాయాల భారీ కలెక్షన్స్‌తో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ‘హను–మాన్‌’ సినిమా తర్వాత తేజ సజ్జా నుంచి రాబోతున్న ‘మిరాయ్‌’ సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రివ్యూ(Tejasajja mirai Review)పై ఓ లుక్కేద్దాం.

కథ ఎలా ఉండబోతుంది?

‘మిరాయ్‌’ అంటే జపాన్‌ భాషలో అద్భుతం అని అర్థం. ‘మిరాయ్‌’ సినిమా టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఎలా ఉంటుందో చూడాలి. ఇక కథ విషయానికి వస్తే…అశోకుడు తన జ్ఞానాన్ని మొత్తం తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్త పరిచాడనే మిథ్‌ ఉంది. ఈ తొమ్మిది గంథ్రాల్లో ఎనిమిది గ్రంథాలను, ఎనిమిది మంది యోథులు రక్షిస్తుంటారు. ఓ గ్రంథం మాత్రం ఓ ఆశ్ర మంలో ఉంటుంది. అయితే ఈ మొత్తం తొమ్మిది గ్రంథాలను సొంతం చేసుకుని, ప్రపంచాన్నే శాసించాలనుకుంటాడు బ్లాక్‌స్వార్డ్‌ (మంచు మనోజ్‌). ఈ విషయం అంబిక (శ్రియ)కు తెలిసి, తన కొడుకు వేద (తేజా సజ్జా)కు మార్గనిర్దేశం చేసి, బ్లాక్‌స్వార్డ్‌ను అడ్డుకోవాలని చెబుతుంది. దీంతో ఈ పనిలో నిమగ్నమవుతాడు వేద. ఇతన్ని గైడ్‌ చేసే అగస్త్యముని తరహా పాత్రలో మలయాళ నటుడు జయరాం కనిపిస్తాడు. తాంత్రిక గురువుగా జగపతిబాబు పాత్ర ఉంటుంది. విభ పాత్రలో ఈ చిత్రం హీరోయిన్‌ రితికా నాయక్‌ కనిపిస్తారు. ఫైనల్‌ బ్లాక్‌స్వార్డ్‌ వంటి బలమైన శక్తిని వేద ఎలా అడ్డు కుంటాడు? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశమట.

సూపర్‌ విజువల్స్‌

Shriya Saran as Ambika Fom Mirai Movie
‘మిరాయ్‌’ సినిమా బడ్జెట్‌ రూ. 60 కోట్ల రూపాయాలకుపైనే అని అంటున్నారు.  టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌లు ఈ సినిమాను నిర్మించారు. ఇక తరహా చిత్రాలకు గ్రాఫిక్స్‌ చాలా ముఖ్యం. ఇందుకోసం మిరాయ్‌ టీమ్‌ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. అయితే వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో విదేశీ సాంకేతిక నిపుణులతో కాకుండ, ఈ చిత్రం నిర్మాణసంస్థ పీపుల్‌మీడియా ఫ్యాక్టరీయే వీఎఫ్‌ఎక్స్‌ పనులను చూసుకుంది. ప్రధానంగా లోకల్‌ వీఎఫ్‌ఎక్స్‌ నిపుణులతో చేశారు. అయితే అవుట్‌ఫుట్‌ అద్భుతంగా వచ్చిందని, మిరాయ్‌ చిత్రం ప్రేక్షకులకు ఓ విజు వల్‌ వండర్‌లా ఉండబోతుందనే టాక్‌ వినిపిస్తోంది. ‘మిరాయ్‌’ సినిమా దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని కూడా ఓ మంచి డీవోపీ. మంచి టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉన్న పర్సన్‌. సో..విజువల్‌ పరంగా మిరాయ్‌ సూపర్‌గా ఉండబోతుందట.

అదిరిపోయే యాక్షన్‌ బ్లాక్స్‌!

Tejasajja mirai Movie first review
Tejasajja mirai Movie first review

‘మిరాయ్‌’ సినిమాలో మొత్తం ఆరెడు యాక్షన్‌ బ్లాక్స్‌ ఉన్నాయి. వీటిలో శ్రీలంకలో తీసిన ట్రైన్‌ యాక్షన్‌ సీక్వెన్స్, తేజ సజ్జా– మంచు మనోజ్‌ల మధ్య వచ్చే ఫైట్‌ సీక్వెన్స్, సంపాతి పక్షి నేపథ్యంతో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌లు మేజర్‌ హైలైట్‌గా ఉండబోతున్నాయని తెలిసింది. ఈ సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ల కోసం తేజ, మనోజ్‌లు ప్రత్యేక శిక్షణ తీసుకోవడం జరిగింది. ఇద్దరు డూప్‌ లేకుండ యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేశారట. ఈ చిత్రాన్ని లైవ్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించడం మరో ఫ్లస్‌ పాయింట్‌. సినిమాలో మైథలాజికల్‌ ఎలిమెంట్స్‌ ఉండటం, ఆరెడు యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉండటం వంటి అంశాల చేత ఆటోమేటిక్‌గా నిడివి పెరిగింది. ఈ సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉంటుందని సమాచారం. ఇక ‘హను–మాన్‌’ సినిమాకు సంగీతం అందించిన హరి గౌరయే, ‘మిరాయ్‌’ సినిమాకూ సంగీతం అందిస్తున్నాడు. ఫైట్‌ సీక్వెన్స్‌లో వచ్చే ఆర్‌ఆర్‌ అదిరిపోతుంట. ఇక ఈ చిత్రంలో రాముడి రిఫరెన్స్‌ ప్రస్తావన కూడా ఉంటుందని, ఈ రాముడి పాత్రలో దగ్గుబాటి రానా నటించారని తెలిసింది.

మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో రీసెంట్‌ టైమ్స్‌లో ‘మిరాయ్‌’ వంటి సూపర్‌ నేచురల్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ సినిమా రాలేదు. మరి….ఈ నేపథ్యంలో ‘మిరాయ్‌’ సినిమా ఆడియన్స్‌ను ఎంత ఎంగేజ్‌ చేస్తుందో చూడాలి. ఆడియన్స్‌ అంచనాలను అందుకోవాలనే ఆశిద్దాం.

కిష్కింధపురి సినిమా ఫస్ట్‌ రివ్యూ

జపాన్‌ యానిమేషన్‌ సినిమాకు ఇంతటి క్రేజా?…ఉదయం 5 గంటలకే షోస్‌

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *