‘సంక్రాంతి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత తన నెక్ట్స్ సినిమాను ఎంచుకోవడంలో వెంకీ (Hero Venkatesh New Movies) డైలామలో పడ్డాడు. మంచి కథ కోసం ఎదురు చూశాడు. చాలానే కథలు విన్నాడు. ఫైనల్‌గా వెంకీ కొన్ని కథలను ఒకే చేశారు. సోలో హీరోగా రెండు సినిమాలు, ఓ మల్టీస్టారర్ మూవీ, గెస్ట్ రోల్‌లో మరో మూవీ ఇలా…నాలుగు సినిమాలను సెట్ చేసుకున్నాడు వెంకటేష్. త్రివిక్రమ్‌తో వెంకటేష్ సోలో హీరోగా ఓ మూవీ రానుంది. అలాగే ‘ద్రుశ్యం 3’ సినిమా రానుంది. దర్శకుడు అనిల్ రావిపూడి (AnilRavipudi)తోనూ ఓ సినిమా కన్ఫార్మ్ చేశాడు వెంకటేష్. ఇంకా… చిరంజీవితో అనిల్‌రావిపూడి చేస్తున్న సిని మాలో వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ చేస్తు న్నాడు. మరో భారీ ప్రాజెక్ట్ అని కూడా వెంకీ చెప్పాడు. ఈ భారీ ప్రాజెక్ట్ అనేది బాలయ్య సినిమాలో అట. ఇలా మొత్తానికి రానున్న రెండు సంవత్సరాలకు వెంకటేష్ మంచి ప్రాజెక్ట్స్‌నే సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతానికి వెంకీ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.
మరి…త్రివిక్రమ్ (Director trivikram) తో వెంకటేష్ చేసే సినిమా ముందు వస్తుందా? లేదా ద్రుశ్యం 3 సినిమా ముందుగా రిలీజ్ అవుతుందా అనేది చూడాలి. ఎందు కంటే…వెంకటేష్ కోసం త్రివిక్రమ్ ఇంకా కథ రెడీ చేయలేదు. ఈ ఫ్యామిలీ డ్రామా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మరోవైపు ద్రుశ్యం 3 సినిమా ఇతర భాషల్లో షూటింగ్ అక్టోబరు నుంచి ప్రారంభం కానుంది. అన్నీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయాలన్నది ప్లాన్ అని జీతూజోసెఫ్ చెప్పారు. సో..ముందుగా ద్రుశ్యం3 సినిమా సెట్స్‌కు వెళ్లినా ఆశ్యర్యం లేదు.
ఇక అనిల్‌రావిపూడితో వెంకటేష్ సినిమా ఉంది. అనిల్ రావిపూడితో మళ్లీ ఓ సినిమా చేయనున్నట్లుగా ‘దిల్’ రాజు చెప్పారు. సో…మరి..’దిల్’ రాజు – అనిల్‌రావిపూడి- వెంకటేష్‌ల కాంబినేషన్‌లో వచ్చే సినిమా ‘ఎఫ్4’నా? లేక ‘మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి తరహా సినిమానా? అనేది చూడాలి.
VijayDevarakonda Kingdom: విజయ్‌దేవరకొండ కింగ్‌డమ్..అలసట లేని భీకరయుద్ధం