వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ తెలుగులో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రూ. 300 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు అనిల్‌రావిపూడి దర్శకుడు. ‘దిల్’ రాజు శిరీష్ నిర్మించారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు అనిల్‌రావిపూడి నెక్ట్స్ మూవీ చిరంజీవి (HeroChiranjeevi) హీరోగా రానుంది. సమ్మర్‌లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. ఆల్రెడీ రెండు పాటల కంపోజిషన్ కూడా పూర్తయిందని తెలిసింది. సాహు గారపాటి ఈ సినిమాకు నిర్మాత.
ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు సాహుగారపాటి ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. దర్శకుడు అనిల్‌రావిపూడి కూడ చెప్పకనే చెప్పాడు. కానీ హీరో చిరంజీవి మాత్రం సంక్రాంతి రిలీజ్‌ను కన్ఫార్మ్ చేయలేకపోతున్నారు. ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా విచ్చేసిన చిరంజీవి, తన నెక్ట్స్ మూవీ అనిల్‌రావిపూడితో అని, సాహుగారపాటి–సుష్మితా కొణిదెల ఈ మూవీని నిర్మిస్తారని చెప్పారు. కామెడీ బ్యాక్‌డ్రాప్ అని కూడా చెప్పారు. కానీ మూవీ సంక్రాంతికి రిలీజ్ అన్న మాట మాత్రం చెప్పడానికి సంశయించారు. ఇప్పుడు ఇది ఇండ్రస్ట్రీ చర్చనీయాంశమైంది.
మరోవైపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ‘దిల్’ రాజు కాస్త డౌట్ ఫీలయ్యారు. ఇదే సమయంలో ‘దిల్’ రాజు నిర్మించిన ‘గేమ్‌చేంజర్’ మూవీ కూడా ఉండటం మరో కారణం కావొచ్చు. కానీ వెంకటేష్ పట్టుదలగా పట్టుబట్టి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా చేశాడు. అనుకున్నట్లుగా హిట్ కొట్టాడు. పైగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్‌మీట్‌లో 2027లో సంక్రాంతి మళ్లీ వస్తాం అని, అనిల్‌రావిపూడితో సినిమా ఉందని కాన్ఫిడెంట్‌గా చెప్పేశాడు. మరి..వెంకీ తరహాలో చిరంజీవి కూడా తన సినిమా సంక్రాంతి రిలీజ్‌ను కన్ఫార్మ్ చేస్తే మెగాఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారు.
మరోవైపు చిరంజీవి హీరోగా చేసిన ‘విశ్వంభర’ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిసింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సిని మాలకంటే చిరంజీవియే ముందుగా సంక్రాంతి రిలీజ్ డేట్‌ను ప్రక టించారు. కానీ సంక్రాంతికి రిలీజ్ చేయలేకపోయారు. మరి…విశ్వంభర డౌట్‌తోనే, తన కొత్త సినిమా రిలీజ్ విషయంలో చిరంజీవి కాస్త తటాపటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది.