మూడేళ్ల తర్వాత ఓ సినిమా తెలుగు సినిమాకు సైన్ చేశారు హీరోయిన్ పూజాహెగ్డే (Heroine Poojahegde). 2022లో చిరంజీవి– రామ్‌చరణ్‌లు నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ ‘ఆచార్య’తో మరో తెలుగు సినిమాలో పూజాహెగ్డే కనిపించలేదు. అలా అనీ పూజ ఏం ఖాళీగా లేరు. ఇతర భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తమిళంలో పూజాహెగ్డే పుల్ బిజీగా ఉన్నారు. ప్రజెంట్ కూడా పూజా చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. మరోవైపు 2024లో విడుదలైన మహేశ్‌బాబు ‘గుంటూరుకారం’ చిత్రంలో పూజాహెగ్డే ఓ హీరో యిన్‌గా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు.
కిష్కింధపురి సినిమా ఫస్ట్ రివ్యూ
దుల్కర్‌సల్మాన్ హీరోగా, రవి నెలకుదిటి దర్శకుడిగా పరిచయం అవుతూ, ఓ ప్రేమకథా చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో పూజ, దుల్కర్‌లపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే క్యారెక్టర్, ఏదో హీరోయిన్ ఉండాలన్నట్లుగా కాకుండ, చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందట. ఈ సినిమా 90 శాతం షూటింగ్‌లో పూజాహెగ్డే పాల్గోన బోతున్నారంటే, ఆమె ఈ పాత్ర ఈ చిత్రానికి ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. అందుకెనెమో..ఈ చిత్రం యూనిట్ పూజాహెగ్డే రాకను అధికారికంగా ప్రకటించినప్పుడు, ‘హార్ట్ ఆఫ్ ది మూవీ’ అంటూ పేర్కొంది.
తేజసజ్జా మిరాయ్ ఫస్ట్ రివ్యూ
అంత బాగానే ఉంది…కానీ మూడు సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా చేస్తున్న పూజాహెగ్డే, తెలుగు హీరో ఉన్న సినిమాలో కాకుండ, మలయాళ హీరో దుల్కర్‌సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుండటం విశేషం. ఇంకా పూజాహెగ్డే నటిస్తున్న ‘కాంచన 4’, దళపతి విజయ్ ‘జననాయగన్’ చిత్రాలు 20 26లో విడుదల కానున్నాయి.