తమిళ ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోతున్నారు హీరోయిన్ పూజాహెగ్డే (Heroine PoojaHegde). సూర్య ‘రెట్రో’ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేశారు. కార్తీక్‌సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే1న రిలీజ్ కానుంది. అలాగే దళపతి విజయ్ మూవీ ‘జననాయగన్’లో హీరోయిన్‌గా చేస్తున్నారు పూజాహెగ్డే. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కా నుంది. అలాగే రాఘవాలారెన్స్ ‘కాంచన 4’లోనూ ఓ హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తున్నారని తెలిసింది.
ఆల్రెడీ చిత్రీకరణ కూడా జరుగుతోంది. మరో హీరోయిన్‌గా నోరాఫతేహీ కనిపిస్తారు.
ఈ తమిళ సినిమాలన్నీ ఇలా ఉండగానే, లేటెస్ట్‌గా మరో తమిళ సినిమా ‘కూలీ’లో పూజాహెగ్డే భాగమై య్యారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘కూలీ’ సినిమా రానుంది. ఈ మూవీలో శ్రుతీహాసన్, నాగార్జున, ఆమీర్‌ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, షౌబిన్ షబ్బీర్‌లు ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది.
అయితే ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, ఈ స్పెషల్‌సాంగ్‌లో పూజాహెగ్డే కనిపిస్తారన్న టాక్ ప్రజెంట్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో తమన్నా ‘నువ్వు కావలయ్యా..’ అనే స్పెషల్‌సాంగ్ చేశారు. ఈ సాంగ్ ఈ సినిమాకు కాస్త మైలేజ్‌నిచ్చింది. ఈ తరహా సాంగ్‌నే ‘కూలీ’లోనూ రెడీ చేశారట మేకర్స్. ఈ సాంగ్‌లో పూజాహెగ్డే కనిపిస్తారని టాక్. ఇక స్పెషల్‌సాంగ్స్ చేయడం పూజాహెగ్డేకు కొత్తం ఏం కాదు. రామ్‌చరణ్ ‘రంగస్థలం’ మూవీలో ‘జిగేల్‌రాణి’, వెంకటేష్ ‘ఎఫ్ 3’లో మరో స్పెషల్ సాంగ్ చేశారు. మరి..‘కూలీ’లో కూడ యాక్ట్ చేస్తారా? ఏమో చూడాలి.