Honey Rose: ఓ వ్యాపారవేత్త తనను ఎంతగానో వేధిస్తున్నాడని, హీరోయిన్ హనీరోజ్ ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి, ఆమె ఓ సుధీర్ఘమైన పోస్టును సోషల్‌మీడియాలో షేర్ చేయగా, అది వైరల్ అవుతోంది.
View this post on Instagram
‘‘ఓ వ్యాపారవేత్త నన్ను ఓ ఈవెంట్‌కు రమ్మనగా వెళ్లాను. కానీ అతని ప్రవర్తన ఏం అంతగా బాగాలేదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడాడు. దీంతో నేను అసౌకర్యానికి గురైయ్యాను. ఇంటికి వచ్చాక అతని మేనేజర్‌కు ఫోన్ కాల్ చేసి, ఇలా మళ్లీ జరిగితే సహించేది లేనది హెచ్చరించాను. పొరపాటు అన్నట్లుగా మాట్లాడాడు. ఆ వ్యాపారవేత్త మరో ఈవెంట్‌కు కూడా నన్ను పిలిచాడు. కానీ నేను వెళ్లలేదు. దీంతో నన్ను టార్గెట్ చేసి, ఇబ్బంది పెడుతున్నాడు. ఆన్‌లైన్ వేదికగా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇలాంటి వారిపై కఠిమైన చట్టాలు తీసుకోవాలి’’ అని హనీరోజ్ ఓ లాంగ్ పోస్ట్‌ను షేర్ చేశారు.
Pawan Kalyan: నేనేప్పుడూ మూలాలు మర్చిపోను: పవన్‌కల్యాణ్
ఇక బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో హనీరోజ్ నటించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ తల్లి పాత్రలో ఆమె యాక్ట్ చేశారు. బాలకృష్ణ కంటే తక్కువ వయసులో ఉన్న హనీరోజ్, ఆ సినిమాలో బాలకృష్ణ పాత్రకు తల్లి రోల్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక ఆ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
Nandamuri Balakrishna Akhanda2: అఖండ 2 రిలీజ్ ఫిక్స్..కాంతారతో పోటీ